బైపాస్‌కు నిధులు ఇవ్వండి
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:13 AM
పాణ్యం నియోజకవర్గంలోని నన్నూరు-చిన్నటేకూరు-గూడురు- ఎమ్మిగనూరు బైపాస్ నిర్మిణానికి నిధులు మంజూరు చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డికి విన్నవించారు.
ఆర్‌ఆండ్‌బీ ఛీఫ్ ఇంజనీర్‌ను కోరిన ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, నవంబర్ 3(ఆంధ్రజ్యోతి): పాణ్యం నియోజకవర్గంలోని నన్నూరు-చిన్నటేకూరు-గూడురు- ఎమ్మిగనూరు బైపాస్ నిర్మిణానికి నిధులు మంజూరు చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డికి విన్నవించారు. సోమవారం కర్నూలుకు వచ్చిన ఆయనను ఎమెలేఏ్య కలిశారు. నన్నూరు నుంచి బస్తిపాడుకు సుమారు 15 కి.మీ.ల రహదారి విస్తరణతో పాటు క్రాస్ డ్రైనేజీ పని చేస్తున్నా రన్నారు. పాణ్యం నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ రహదారులకు కూడా నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. కర్నూలు జిల్లా అనుగొండ-లక్ష్మీపురం రహదారి మరమ్మతులకు-రూ.15 లక్షలు, మిడ్తూరు-ఓర్వకల్లు సీసీ రహదారికి రూ.50 లక్షలు, నంద్యాల-నందికొట్కూరు రహదారి పనులకు రూ.20 లక్షలు, గోనవరం-బలపనూరు రహదారికి రూ.27 లక్షలు మొత్తం రూ.1.12కోట్ల అంచనా వ్యయంతో పనులకు పరిపాలనా అమోదం మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఛీప్ ఇంజనీరుకు లేఖ అందించారు.