Share News

జనన సర్టిఫికెట్లు వెంటనే జారీచేయండి

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:08 PM

ఆస్పత్రుల్లో జన్మించే ప్రతి నవజాత శిశువుకు వెంటనే జనన సర్టిఫికెట్లు జారీచేయాలని కలెక్టర్‌ రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు.

జనన సర్టిఫికెట్లు వెంటనే జారీచేయండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి గనియా

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల హాస్పిటల్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రుల్లో జన్మించే ప్రతి నవజాత శిశువుకు వెంటనే జనన సర్టిఫికెట్లు జారీచేయాలని కలెక్టర్‌ రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం, జనన-మరణ నమోదు కార్యక్రమంపై సమీక్షాసమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రు ల్లో శిశువు జననం జరిగిన వెంటనే ఆస్పత్రి ద్వారానే రిజిస్ట్రేషన్‌ పూర్తవ్వాలని, తల్లిదండ్రులు ధ్రవపత్రం కోసం తిరగాల్సిన అవసరంలేకుండా వెంటనే సర్టిఫికెట్‌ అందజేయాలన్నారు. శిశువు జననానికి సం బంధించి ప్రత్యేకంగా సిబ్బందిని పెట్టి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఒక సంవత్సరం లోపు అయితే ఉచి తంగా నమోదు చేస్తారని, సంవత్సరం దాటితే ప్రభుత్వం నిర్దేశించిన రుసుం చెల్లించి నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. డూప్లికేట్‌ జననాలు నమోదవకుండా చర్యలు తీసుకోవాలని డీపీవోను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా.వెంకటరమణ, డా.శారదాబాయి, మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి లీలావతి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.మల్లేశ్వరి, ట్రైబల్‌ వెల్ఫేర్‌, ఇంటర్‌ విద్య, ఎయిడ్స్‌ నియంత్రణ క్లస్టర్‌ ప్రోగ్రాం మేనేజర్‌ అలీహైదర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 11:08 PM