Share News

స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు జరిగేనా?

ABN , Publish Date - Jul 16 , 2025 | 12:25 AM

నగర పాలక సంస్థకు సంబంధించి స్టాండింగ్‌ కమిటి సభ్యుల ఎన్నిక జరిగేనా అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ఇదే నెలలో 18న నోటిఫికేషన్‌ విడుదల చేసిన అదికారులు ఇప్పటి వరకు ఎన్నికపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు

స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు జరిగేనా?

అధికార పార్టీ కార్పొరేటర్లు బరిలో ఉంటారా?

ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లను ప్రకటించనున్న అధిష్టానంత

కర్నూలు న్యూసిటీ, జూలై 15(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థకు సంబంధించి స్టాండింగ్‌ కమిటి సభ్యుల ఎన్నిక జరిగేనా అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ఇదే నెలలో 18న నోటిఫికేషన్‌ విడుదల చేసిన అదికారులు ఇప్పటి వరకు ఎన్నికపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. గత సంవత్సరం జులైలో 18 నుంచి 24 వరకు నామినేషన్లను స్వీకరణ, సాయంత్రం స్వీకరించిన వారి పేర్లను నోటిసు బోర్డులో ఏర్పాటు చేయడం, . 25న పరిశీలన, 28న విత్‌డ్రా అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

అనివార్యకారణాల వల్ల ఆగుస్టు 1న ఎన్నికలు జరిగాయి. గత సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వైసీపీ నుంచి టీడీపీలోకి సుమారు 9 మంది కార్పొరేటర్లు చేరారు. దీంతో ఎలాగైనా టీడీపీ నుంచి కమిటిలో స్థానం సంపాదించాలని 4 మంది కార్పొరేటర్లు నామినేషన్‌ దాఖలు చేశారు. అదే విధంగా వైసీపీ నుంచి 5 మంది నామినేషన్‌ వేశారు. మొత్తానికి గత స్టాండింగ్‌ కమిటి ఎన్నికల్లో టీడీపీ నాయకులు డబ్బు ఆశ చూపిన కూడ ఒక్క సభ్యున్ని కూడ గెలిపించుకోలేక పోయారు. మొత్తం వైసీపీ సభ్యులకే ఎన్నికయ్యారు. ప్రస్తుతం అదే జరిగే ఏమిటనే సందిగ్దంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నగర పరిదిలో కూటమి కార్పొరేటర్లు ఓటమి చెందితే ఎలా అని కొందరు ప్రశ్నించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే 2026లో కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగితే ప్రస్తుతం ఎన్నుకున్న సభ్యులకు కేవలం 8 నెలల మాత్రమే కాలపరిమితి ఉంటుందగి. దీని కోసమే ఇప్పటి వరకు స్టాండింగ్‌ కమిటి సభ్యులు ఎన్నికపై అధికార పార్టీ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారమే అధికారులు స్టాండింగ్‌ కమిటి ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

Updated Date - Jul 16 , 2025 | 12:25 AM