Share News

ఆఫీసులో ఉండేవారు ఉత్తమ ఉపాధ్యాయులా?

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:53 AM

కార్యాలయంలో పనిచేసే వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎలా ఎంపిక చేశారని మండల విద్యాధికారులను ఎస్టీయూ నాయకులు నిలదీశారు.

ఆఫీసులో ఉండేవారు ఉత్తమ ఉపాధ్యాయులా?
మాట్లాడుతున్న ఎంఈవో రమేష్‌

ఎంఈవోపై ఎస్టీయూ నాయకుల ఆగ్రహం

పత్తికొండ టౌన్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కార్యాలయంలో పనిచేసే వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎలా ఎంపిక చేశారని మండల విద్యాధికారులను ఎస్టీయూ నాయకులు నిలదీశారు. గురువారం కార్యాలయంలో ఎంఈవోలు రాజారామ్మోహన్‌రావు, రమేష్‌ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సన్మానం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే నాయకులు మాట్లాడుతూ పాఠశాలలకు వెళ్లి చదువు చెప్పే ఉపాధ్యాయులను ఎంపిక చేయాలన్నారు. అలా కాకుండా ఎంఈవో ఆఫీసుకు పరిమితమైన ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎలా అవుతారని కొప్పటి నారాయణ, బలరాముడు, చెన్నకేశవులు, వెంకటేశ్వర్లు మండిపడ్డారు. స్పందించిన ఎంఈవో రమేష్‌ అది తన ఇష్టమని సమాధానమిచ్చారు. దీంతో ఎస్టీయూ నాయకులు ఇప్పటికైనా ఎంఈవోలు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక విషయంలో తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎస్టీయూ ఆధ్వర్యంలో వారి విధానాలను ఎండగడతామని హెచ్చరించారు.

Updated Date - Sep 05 , 2025 | 12:53 AM