2.65 లక్షల ఎకరాలకు సాగునీరు: ఎస్‌ఈ
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:26 PM
కర్నూలు-కడప జిల్లాల్లో కేసీ కెనాల్ కింద 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం ఉందని కర్నూలు ఉమ్మడి జిల్లా ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి తెలిపారు.
చాగలమర్రి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కర్నూలు-కడప జిల్లాల్లో కేసీ కెనాల్ కింద 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం ఉందని కర్నూలు ఉమ్మడి జిల్లా ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి తెలిపారు. మండలంలోని రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నీటి ప్రవాహాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఎస్‌ఈ మాట్లాడుతూ శ్రీశైలంలో 885 అడుగులకు గానూ 883.20 అడుగుల నీరు నిల్వ ఉందని తెలిపారు. 1.13 లక్షల నీరు ఇన్‌ఫ్లో అవుతోందని, 205.66 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. నంద్యాల జిల్లాలో 1.69 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం ఉందని తెలిపారు. రాజోలి ఆనకట్ట వద్ద 3,978 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందన్నారు. శ్రీశైలం నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారని తెలిపారు. కడప జిల్లాలో 92 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ ఏడాది ముందస్తుగా సాగునీరు విడుదల చేయడంతో రైతులు వరి నాట్లు వేసుకునేందుకు వీలు కలిగిందని అన్నారు. కార్యక్రమంలో డీఈ పుల్లయ్య, ఏఈలు జమాల్‌వలి, ఆశాజ్యోతి, సూపర్‌వైజర్ దస్తగిరి, లస్కర్లు ఉన్నారు.