ఉపాధి పనుల్లో అక్రమాలు
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:28 AM
ఉపాధి పనుల్లో అక్రమాలు బయటపడ్డాయి. మంగళవారం పట్టణంలోని మండల పరిషత కార్యాల యం ఆవరణలో ఉపాధి పనులపై నిర్వహించిన సామాజిక బహిరంగ సభకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యనారా యణ, అంబుడ్స్ పర్సన మద్దిలేటి, అసిస్టెంట్ విజిలెన్స ఆఫీసర్ పరమే శ్వరుడు, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ నరేంద్రకుమార్ హాజరయ్యారు.
సామాజిక తనిఖీల్లో బహిర్గతం
రూ.69,922 రికవరీకి ఆదేశించిన అధికారులు
అవుకు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉపాధి పనుల్లో అక్రమాలు బయటపడ్డాయి. మంగళవారం పట్టణంలోని మండల పరిషత కార్యాల యం ఆవరణలో ఉపాధి పనులపై నిర్వహించిన సామాజిక బహిరంగ సభకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యనారా యణ, అంబుడ్స్ పర్సన మద్దిలేటి, అసిస్టెంట్ విజిలెన్స ఆఫీసర్ పరమే శ్వరుడు, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ నరేంద్రకుమార్ హాజరయ్యారు. ఈసందర్భంగా పీడీ సూర్యనారాయణ మాట్లాడుతూ మండలంలో 2024 ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 2025 మార్చి నెల 31వ తేదీ వరకు ఉపాధి హామీ పనులు, అనుబంధ శాఖలు కలసి 1,016 పనులు చేప ట్టి రూ. 10 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఈ పనులపై గత నెల 19వ తేదీ నుంచి ఈనెల 26వ తేదీ వరకు 21 గ్రామ పంచాయతీల్లో జరిగిన పనులపై డీఆర్‌పీలు క్షేత్ర స్థాయిలో పర్యటించి తనిఖీలు చేపట్టారని అన్నారు. ఉపాధి పనుల్లో 69,922 అక్రమాలు జరిగినట్లు వెల్లడి అయిం దన్నారు. అత్యధికంగా జూ నూతల పంచాయతీలో రూ.16,117, మన్నేనాయక్ తండాలో రూ.15,915, చనుగొండ్లలో రూ.10,649, గుండ్లశింగవరంలో రూ. 6,035, అన్నవరంలో రూ.5వేలు, అవుకులో రూ.3,540, కునుకుంట్లలో రూ.3,085, శింగనపల్లెలో రూ.2,270 అక్ర మాలు జరిగాయని అన్నారు. సుంకేశుల, కాశీపురం, రామాపురం, మం గంపేట, సంగపట్నం పంచాయతీలు మినహా మిగిలిన పంచాయతీల్లో రూ. 300నుంచి రూ. 2వేలు వరకు అక్రమాలు జరిగినట్లు గుర్తించా మన్నారు. వారం రోజుల్లోపు రికవరీకి ఆదేశించామన్నారు. కార్యక్ర మంలో ఎంపీడీవో రామక్రిష్ణవేణి, ఎనఆర్‌జీఎస్ ఏపీవో ప్రకాష్‌రావు, ఈసీ రాగిని, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.