Share News

రూ.31కోట్లకు ఐపీ పెట్టిన గోస్పాడు వాసి

ABN , Publish Date - May 29 , 2025 | 12:40 AM

మండలానికి చెందిన గంగుల వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి రూ.31 కోట్లకు ఐపీ పెట్టినట్లు సమాచారం. గతంలో ఆయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. వ్యాపారం బాగుందని చాలా మంది రైతులు, చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, నంద్యాల పట్టణం, గోస్పాడు చుట్టు పక్కన ఉన్న పల్లెల వారు కూడా ఆయనకు అప్పులిచ్చారు.

రూ.31కోట్లకు ఐపీ పెట్టిన గోస్పాడు వాసి

88 మందికి నోటీసులు

కర్నూలుకు చెందిన వ్యాపారికి రూ.5 కోట్ల అప్పు

నంద్యాల టౌన్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): గోస్పాడు మండలానికి చెందిన గంగుల వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి రూ.31 కోట్లకు ఐపీ పెట్టినట్లు సమాచారం. గతంలో ఆయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. వ్యాపారం బాగుందని చాలా మంది రైతులు, చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, నంద్యాల పట్టణం, గోస్పాడు చుట్టు పక్కన ఉన్న పల్లెల వారు కూడా ఆయనకు అప్పులిచ్చారు. అందరి డబ్బులు దండుకుని ఆయన కర్నూ లుకు నివాసం మార్చినట్లు సమాచారం. వెంకటేశ్వర రెడ్డి తన వద్ద కేవలం ఇల్లు, కొంత స్థలం ఉందని అప్పులిచ్చిన 88 మందికి ఐపీ నోటీసులు ఇచ్చి టోపి పెట్టాడు. దీంతో బాధితులు ఏమీ చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో ఉన్నారు ఇందులో లాయర్లు, వైద్యులు, న్యాయవాదులు, పట్టణ ప్రముఖులు కూడా ఉన్నారు. కర్నూలుకు చెందిన ఒక వ్యాపారి వద్ద ఏకంగా రూ.5కోట్లు అప్పు తీసుకు టన్నారు. అలాగే ఒక విశ్రాంత డీఎస్పీ కి రూ.25లక్షలు ఇవ్వాలి. కర్నూలుకు చెందిన మరో వ్యాపారికి రూ.2.75 కోట్లు, పాములపాడుకు చె ందిన వ్యాపారికి రూ.1.5 కోట్లు, హైదరాబాద్‌కు చెందిన మరో వ్యాపారికి రూ.1.3 కోట్లు, కోవెలకుంట్లకు చెందిన వ్యక్తికి రూ.1కోటి ఇలా సుమారుగా 88 మంది వద్ద అప్పులు తీసుకుని నోటీసులు ఇచ్చాడు. రూ.50 లక్షల లోపు ఉన్నవారు సుమారుగా 18 వరకు ఉన్నారు. మిలిగిన వారందరూ రూ.2.5 లక్షల నుంచి అప్పులు ఇచ్చారు. కర్నూలులో ఉన్న అతని ఇంటిని నగరానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు అప్పు కింద తీసుకున్నట్లు సమాచారం. గోస్పాడులో ఉన్న 6 ఎకరాల పొలాన్ని ఆళ్లగడ్డకు చెందిన ప్రజాప్రతినిధులు అప్పు కింద తీసుకున్నట్లు సమాచారం. బాధితులు త్వరలో జిల్లా ఉన్నతాధికారులను కలవనున్నట్లు సమాచారం.

Updated Date - May 30 , 2025 | 03:09 PM