Share News

సీబీఎన్‌ బ్రాండ్‌తోనే రాష్ట్రానికి పెట్టుబడులు

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:53 AM

సీబీఎన్‌ బ్రాండ్‌ తోనే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

సీబీఎన్‌  బ్రాండ్‌తోనే రాష్ట్రానికి పెట్టుబడులు
మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్‌

మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): సీబీఎన్‌ బ్రాండ్‌ తోనే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. శనివారం నగరంలోని సెయింట్‌ జోసెప్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్‌ మేళాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఓర్వకల్లు పారిశ్రామిక పార్క్‌కు భారీ పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. ఇప్పటికే రూ.10వేల కోట్ల పెట్టుబడులు తీసుకొ చ్చామన్నారు. రాష్ట్రాల మధ్య పెట్టుబడులను ఆకర్షించడంలో గట్టి పోటీ నెలకొందని, అయినా జిల్లాలో రూ.1650 కోట్ల పెట్టుబడితో ఓర్వకల్లులో రిలయన్స కంపెనీ పనులు మొదలు పెట్టిందన్నారు. జాబ్‌ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

చదువుతోపాటు భాషా నైపుణ్యాలు పెంచుకోవాలి

కర్నూలు కల్చరల్‌: విద్యార్థులు చదువుతోపాటూ భాషా నైపుణ్యాలు పెంచుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. శనివా రం నగరంలోని నెహ్రూరోడ్డులోని సత్యసాయి కళాక్షేత్రంలో ‘షేపింగ్‌ టుమారోస్‌ ఫ్యూచర్‌’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి టీజీ భరత హాజరై మాట్లాడారు. సత్యసాయి కళా క్షేత్రంలో విద్యార్థుల వ్యక్తిత్వ విసాసం పెంపొందించేందుకు కార్యక్ర మాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణుడు మండి అన్వర్‌ హుస్సేన, రాంప్రసాద్‌, సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పూర్వ అధ్యక్షుడు సాయిబాబా, కన్వీ నర్‌ మాకా అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 12:53 AM