మార్కెట్ యార్డులో అక్రమాలపై విచారణ
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:08 AM
నంద్యాల మార్కెట్ యార్డులో జరుగుతున్న అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో ఈనెల 3వ తేదీన ‘పైసా వసాల్..’, 5వ తేదిన ‘అక్రమార్కుల్లో అలజడి..’ శీర్షికలతో ప్రచురితమైన కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు.
నేడు కలెక్టర్‌కు జేడీ నివేదిక
నంద్యాల, మార్చి7 (ఆంధ్రజ్యోతి): నంద్యాల మార్కెట్ యార్డులో జరుగుతున్న అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో ఈనెల 3వ తేదీన ‘పైసా వసాల్..’, 5వ తేదిన ‘అక్రమార్కుల్లో అలజడి..’ శీర్షికలతో ప్రచురితమైన కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు. కలెక్టర్ రాజకుమారి స్పందించి ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులను విచారణ అధికారిగా నియమించారు. దీంతో సదరు అధికారి సోమవారం స్థానిక నంద్యాల మార్కెట్‌యార్డులో కార్యదర్శి కల్పన తదితర అధికారులతో పలు అంశాలపై ఆరా తీశారు. పత్రికలో వచ్చిన ఆంశాల పరంగా రికార్డులతో పాటు అద్దెల వివరాలను పరిశీలించగా.. పలు లోపాలు వెలుగు చూసినట్లు సమాచారం. మార్కెట్‌యార్డు అద్దెలు, తదితర వసూళ్ల పరంగా వ్యత్యాసాలను గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విచారణలో గుర్తించి అంశాల పరంగా సమగ్ర నివేదికను కలెక్టర్‌కు మంగళవారం అందజేస్తామని జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు తెలిపారు.