Share News

సమసమాజం కోసం ఉద్యమాల్లోకి..

ABN , Publish Date - May 25 , 2025 | 11:46 PM

దోపిడీ, పీడనలు లేని సమసమాజం కోసం మావో యిస్టు ఉద్యమంలోకి వెళ్లిన మావోయిస్టు కామ్రేడ్‌ లలిత అలియాస్‌ సంగీత ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా సైనికులు జరిపిన డాడుల్లో అమరురాలైందని పౌర హక్కుల సం ఘం జిల్లా కార్యదర్శి అల్లా బకాష్‌ పేర్కొన్నారు.

సమసమాజం కోసం ఉద్యమాల్లోకి..
మాట్లాడుతున్న పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అల్లా బకాష్‌

‘కగార్‌’లో అమరురాలైన కామ్రేడ్‌ సంగీత

పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అల్లా బకాష్‌

కర్నూలు, మే 25 (ఆంధ్రజ్యోతి): దోపిడీ, పీడనలు లేని సమసమాజం కోసం మావో యిస్టు ఉద్యమంలోకి వెళ్లిన మావోయిస్టు కామ్రేడ్‌ లలిత అలియాస్‌ సంగీత ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా సైనికులు జరిపిన డాడుల్లో అమరురాలైందని పౌర హక్కుల సం ఘం జిల్లా కార్యదర్శి అల్లా బకాష్‌ పేర్కొన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్పరి మండలం ములుగుందం గ్రామంలో దళిత సామాజికవర్గానికి చెందిన దుబ్బన్న, ఏస్తెరమ్మ దం పతుల కుమార్తె లలిత. నర్సింగ్‌ చేసిన ఆమె ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వెళ్లిందని తెలిపారు. అక్కడ కుల నిర్మూలన పోరాట సమితిలో కీలకంగా మారి దళిత హక్కుల కోసం పనిచేసిందని వివరించారు. ఆక్రమంలోనే మావోయిస్టు ఉద్యమంతో పరిచ యాలు పెరిగి, పార్టీ కార్యకర్తగా అజ్ఞాతంలోకి వెళ్తిందన్నారు. 20 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేసిందని వివరించారు. ఇటీవలే అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లలిత అలియాస్‌ సంగీత మృతిచెందిందన్నారు. ఆమె మృతదేహం కోసం సోదరులు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపుర్‌కు వెళ్లారని, అక్కడి పోలీసులు మృతదేహం అప్పగిం చ లేదన్నారు. ఆమె మృతదేహం రాగానే అంత్యక్రియలు స్వగ్రామం ఆస్పరి మండలం ములుగుందంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌డీపీఐ నాయకులు జహంగీర్‌, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్‌ భాస్కర్‌రెడ్డి, విరసం బాధ్యులు నాగేశ్వర ఆచారి పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 11:46 PM