హమ్మయ్య.. పరీక్షలు ముగిశాయి
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:53 AM
పరీక్షలు ముగియడంతో ఇంటర్మీడియట్ విద్యార్థులు శనివారం ఉత్సాహంగా కనిపించారు. మార్చి 1న పరీక్షలు ప్రారంభం కాగా, పట్టణంలో 7 పరీక్ష కేంద్రాల్లో 3150 మంది ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరయ్యారు. కొందరు విద్యార్థులు ఫలితాలపై ధీమా వ్యక్తం చేశారు. మరికొందరు విద్యార్థులు బేకరీలు, హోటళ్లలో పార్టీలు చేసుకుని, స్నేహితులకు వీడ్కోలు పలికారు.

వీడ్కోలు చెప్పుకున్న విద్యార్థులు
ఆదోని అగ్రికల్చర్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) పరీక్షలు ముగియడంతో ఇంటర్మీడియట్ విద్యార్థులు శనివారం ఉత్సాహంగా కనిపించారు. మార్చి 1న పరీక్షలు ప్రారంభం కాగా, పట్టణంలో 7 పరీక్ష కేంద్రాల్లో 3150 మంది ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరయ్యారు. కొందరు విద్యార్థులు ఫలితాలపై ధీమా వ్యక్తం చేశారు. మరికొందరు విద్యార్థులు బేకరీలు, హోటళ్లలో పార్టీలు చేసుకుని, స్నేహితులకు వీడ్కోలు పలికారు.
డాక్టర్ కావడమే లక్ష్యం
ఇంటర్ ఫస్టియర్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. రెండో ఏడాదిలోనూ మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నాను. నీట్, కోచింగ్‌కి హైదరాబాద్ లేదా విజయవాడ వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాను. - రోహిణి, బైపీసీ, అక్షర శ్రీ కళాశాల
ముగిసిన ఇంటర్ పరీక్షలు
మద్దికెర: ఇంటర్ పరీక్షలు ముగిశాయి. స్థానిక ఆదర్శ పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు.