మధ్యంతర భృతిని ప్రకటించాలి: ఎస్టీయూ
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:14 AM
మధ్యంతర భృతి, 30 శాతం ఐఆర్ తక్షణమే ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శివశంకర్ ప్రభుత్వాన్ని కోరారు.
చాగలమర్రి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): మధ్యంతర భృతి, 30 శాతం ఐఆర్ తక్షణమే ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శివశంకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం చాగలమర్రి ఎస్టీ యూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూట మి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా పెండింగ్ డీఏలు చెల్లించక పోవడం, పీఆర్సీ కమిటీ నియమించక పోవడం దారుణమన్నారు. యాప్‌ల భారంతో ఉపాధ్యాయులు బోధన చేయలేని పరిస్థితి నెలకొం దని అన్నారు. యాప్‌ల భారం తగ్గిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రోజుకు కొత్త ప్రోగ్రామ్ తీసుకొస్తూ ఉపాధ్యాయులపై పని ఒత్తిడి చేస్తుందని విమర్శించారు. సమావేశంలో ఎస్టీయూ మండల అధ్యక్షుడు మస్తానబాషా, నాయకులు మహబూబ్‌బాషా, రాజశేఖర్‌రెడ్డి, నారాయణ రెడ్డి, సుబ్బారావు, మాబుహుసేన, గురుచంద్రుడు పాల్గొన్నారు.