Share News

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలి

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:55 PM

: ఇంటర్మీడియట్‌ ప్రఽథమ, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్‌, థీరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులను, కళాశాలల ప్రిన్సిపాళ్లను, అధ్యాపకులను ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు ఈఆర్‌టిడబ్ల్యూ విభాగం అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌ జయ సుబ్బారెడ్డి ఆదేశించారు.

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలి
మాట్లాడుతున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జయసుబ్బారెడ్డి

ఇంటర్‌ బోర్దు ఈఆర్‌టీడబ్ల్ల్యూ

విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జయా సుబ్బారెడి

కర్నూలు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ప్రఽథమ, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్‌, థీరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులను, కళాశాలల ప్రిన్సిపాళ్లను, అధ్యాపకులను ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు ఈఆర్‌టిడబ్ల్యూ విభాగం అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌ జయ సుబ్బారెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ టౌన్‌ మోడల్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పరీక్షలపై అధికారులకు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు అవగాహన కార్యక్రమము జరిగింది. ఈ సందర్భంగా జయసుబ్బారెడ్డి మాట్టాడుతూ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈసారి ఇంటర్‌ పరీక్షల్లో అనేక సంస్కరణలు జరిగాయని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని తెలిపారు. రెండవ సంవత్సరం పరీక్షల్లో మార్పులు లేవన్నారు. పరీక్షల బుక్‌ లెట్స్‌ కొందరికి 24 పేజీలు ఉంటే, మరికొందరికి 32 పేజీలు ఉంటాయన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సురేష్‌ బాబు మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌ఐఓ లాలెప్ప మాట్లాడుతూ పరీక్ష ఫలితాలపై కలెక్టర్‌ సీరియస్‌గా ఉన్నారని వివరించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాళ్లు పరమేశ్వర్‌ రెడ్డి, సుంకన్న, గురువయ్య శెట్టి పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 11:55 PM