భూముల పరిశీలన
ABN , Publish Date - Jul 26 , 2025 | 11:06 PM
ఓర్వకల్లు విమానాశ్రయం సమీపాన విమానాశ్రయానికి అదనంగా భూములు కావాలని దరఖాస్తు చేసుకోవడంతో శనివారం కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, తహసీల్దార్ విద్యాసాగర్ ఆ భూములను పరిశీలించారు.
ఎకరాకు రూ.19 లక్షల నష్టపరిహారం
ఓర్వకల్లు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లు విమానాశ్రయం సమీపాన విమానాశ్రయానికి అదనంగా భూములు కావాలని దరఖాస్తు చేసుకోవడంతో శనివారం కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, తహసీల్దార్ విద్యాసాగర్ ఆ భూములను పరిశీలించారు. ఓర్వకల్లు పొలిమేరలోని 551, 552, 606, 708 వివిధ సర్వే నెంబర్లలో పట్టా భూమి 35 ఎకరాల 61 సెంట్ల భూమిని అదనంగా విమానాశ్రయానికి కేటాయించారు. పూడిచర్ల గ్రామ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.19లక్షలు నష్టపరిహారంగా ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకు రైతులు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ శంకర్ మాణిక్యం, వీఆర్వో స్వామన్న, సచివాలయ సర్వేయర్ కీర్తన పాల్గొన్నారు.