ఈవీఎంల గోడౌన్ తనిఖీ
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:53 PM
ఈవీఎంల గోడౌన్ తనిఖీ
నంద్యాల ఎడ్యుకేషన్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని టెక్కె మార్కెట్‌యార్డులోని ఈవీఎంల గోడౌన్‌ను కలెక్టర్ రాజకుమారి శనివారం తనిఖీ చేశారు. అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్‌ను తొలగించి కలెక్టర్ ఈవీఎంలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సం తకం చేసి తనిఖీలను అధికారికంగా నమోదు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ గార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్వో రామునాయక్, ఆర్డీవో విశ్వనాఽథ్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎలక్షన్ డీటీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
అపార్ ఐడీ కీలకం: కలెక్టర్
నూతన జాతీయ విద్యావిధానంలో విద్యార్థుల విద్యాపురోగతిని ట్రాక్ చేయడానికి అపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కీలకమని కలెక్టర్ రాజకుమారి అన్నారు. పట్టణంలోని కలెక్టర్ చాంబర్‌లో శనివారం అపార్ ఐడీ ప్రగతిపై కలెక్టర్ రాజకుమారి విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ 138 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్న 16,102 మంది విద్యార్థుల్లో 11,301 మంది విద్యార్థులకు అపార్ ఐడీ పూర్తయిందని తెలిపారు. పదో తరగతి సర్టిఫికేట్‌లోని పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌లోని పేరు పుట్టినతేదీ సమానంగా ఉంటేనే అపార్ ఐడీ జనరేట్ అవుతుందని చెప్పారు. ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి రూ.50లు చెల్లించి అపార్ ఐడీ జనరేట్ చేయించుకోవాలని సూచించారు. 1962 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 3,30,135 మంది విద్యార్థుల్లో 2,72,193 మందికి అపార్ ఐడీ పూర్తయిందని, మిగిలిన 57,942 మంది ఐడీలు త్వరితగిన పూర్తి చేయాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 40,798 మంది చిన్నారులలో 24,936 మందికి అపార్ ఐడీ పూర్తి కాగా 15,894 ఐడీలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. డీఈవో, డీవీఈవో, ఐసీడీఎస్ పీడీలు పూర్తి స్థాయిలో దృష్టిసారించి ప్రత్యేక చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఈవో జనార్దన్‌రెడ్డి, డీవీఈవో శంకర్‌నాయక్, ఐసీడీఎస్ పీడీ లీలావతి, జీఎ్‌సడబ్ల్యూఎస్ కోఆర్డినేటర్ ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.