అభివృద్ధి పనుల తనిఖీ
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:04 AM
బనగానపల్లె పట్టణంలో జరుగుతున్న అండర్ డ్రైనేజీ అభివృద్ధి పనులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బనగానపల్లె, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): బనగానపల్లె పట్టణంలో జరుగుతున్న అండర్ డ్రైనేజీ అభివృద్ధి పనులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అండర్ డ్రైనేజీ పనులకు స్వయంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సంబంధిత అధికారి, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కోరారు. ఆయా అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. అండర్ డ్రైనేజీ అభివృద్ధి పనులపై, ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.