సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలి
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:13 AM
నగర పాలక అధికారులు, సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. మంగళవారం జొహరాపురం లోని కాలనీల్లో పర్యటించి పారిశుద్య నిర్వహణ, తాగునీటి సరఫరా పరిస్థితులను పరిశీలించారు
నగర పాలక కమిషనర్ విశ్వనాథ్
ఇద్దరు శానిటేషన్ కార్యదర్శులపై చర్యలకు ఆదేశం
కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నగర పాలక అధికారులు, సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. మంగళవారం జొహరాపురం లోని కాలనీల్లో పర్యటించి పారిశుద్య నిర్వహణ, తాగునీటి సరఫరా పరిస్థితులను పరిశీలించారు. చెత్త సకాలంలో తొలగించకపోవడం, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం కనిపించడంతో ఇద్దరు శానిటేషన్ కార్యదర్శులపై చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. పూడిక తీత ఎందుకు చేయలేదని శానిటేషన్ ఇన్స్‌పెక్టర్ పనితీరుపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోచోట తాగునీటి కుళాయి డ్రైనేజీలో ఉండటాన్ని గుర్తించి, ట్యాబ్ ఇన్స్ పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలా లను గుర్తించి నోటీసులు జారీ చేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మునగాలపాడు ఎస్‌ఎస్ ట్యాంకు వద్ద 130 ఎకరాల భూమిని పరిశీలించి, సర్వే, అభివృద్ది, ఆహ్లదకరమైన, వినోద వాతావరణ వసతుల కల్పనకు ప్రతిపాదనలపై చర్చించారు. ప్రజారోగ్యం, పరిశుభ్రత, తాగునీటి అంశాల్లో రాజీ ఉండకూడదని కమిషనర్ స్పష్టం చేశారు డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి, ప్రజారోగ్య అధికారి డా.నాగశివప్రసాద్, డీఈఈ నరేష్, ఏఈ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.