సాగునీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం
ABN , Publish Date - Jul 26 , 2025 | 11:10 PM
సాగునీటి హక్కులపై ప్రభుత్వాల ఉదాసీనత వైఖరి వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.
బొజ్జా దశరథరామిరెడ్డి
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): సాగునీటి హక్కులపై ప్రభుత్వాల ఉదాసీనత వైఖరి వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం కేసీ కెనాల్ నీటి వాటాపై వినిపిస్తున్న వాదనలపై శనివారం బొజ్జా స్పందిస్తూ కీలక అంశాలను ప్రస్తావించారు. కేసీ కెనాల్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 39.9 టీఎంసీల నీటివాటాను 18.5 టీఎంసీలకు తగ్గించి ఆదాఅయిన నీటిని తెలంగాణకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తోందన్నారు. ఇది కేవలం కేసీ కెనాల్ నీటి హక్కులను తగ్గించడానికి చేస్తున్న ప్రయ త్నమే కాదని, ఇలాంటి వాదానలనే అన్ని ప్రాజెక్టుల మీద తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారం ట్రిబ్యునల్ నీటి వాటాలను కేటాయిస్తే రాయలసీమ లోని అన్ని ప్రాజెక్టులు స్మారక చిహ్నాలుగా మిగిలి ఎడారి ప్రాంతంగా మారే ప్రమాదం ఉందన్నారు మన నీటి హక్కులపై ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా దృష్టిసారించాలని, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించి కొత్త టర్మ్ ఆఫ్ రెఫరెన్స్‌ను రద్ధు చేయాలని కోరారు.