Share News

హాస్టళ్లలో మౌలిక వసతులు పెరగాలి

ABN , Publish Date - Nov 15 , 2025 | 10:54 PM

జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు అం దుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి హాస్టల్‌ వార్డెన్లను ఆదేశించారు.

హాస్టళ్లలో మౌలిక వసతులు పెరగాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు అం దుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి హాస్టల్‌ వార్డెన్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, ట్రైబల్‌వెల్ఫేర్‌, కేజీబీవీ, మోడల్‌స్కూళ్లకు సంబంధించిన హాస్టళ్లు, వసతులపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న పిల్లలను వారి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో వదలి వెళ్తారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, శుభ్రత, చదువు విషయంలో వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గత ఏడాది పదోతరగతిలో 82 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారని, ఈ ఏడాది విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు యాక్షన్‌ప్లాన్‌ రూపొందించుకోవాలని సూచించారు. వసతిగృహల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి చింతామణి, బీసీ సంక్షేమ శాఖ అధికారి గిడ్డయ్య, డీఈఓ జనార్దన్‌రెడ్డి, సమగ్రశిక్ష ప్రాజెక్టు కో.ఆర్డినేటర్‌ ప్రేమనాథ్‌ కుమార్‌, గురుకుల కో.ఆర్డినేటర్‌ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 10:54 PM