పోటీలతో క్రీడాసక్తి పెరిగే అవకాశం
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:43 AM
: పోటీల నిర్వహణతో విద్యార్థినుల్లో క్రీడాసక్తి పెరుగుతుందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణిరెడ్డి అన్నారు.
వైసీపీ మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి నాగవేణిరెడ్డి
కర్నూలు స్పోర్ట్స్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పోటీల నిర్వహణతో విద్యార్థినుల్లో క్రీడాసక్తి పెరుగుతుందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణిరెడ్డి అన్నారు. నగరంలోని డీఎ్‌సఏస్టేడియంలో గురువారం అస్మిత ఖేలో ఇండియా షూటింగ్ బాల్ లీగ్ పోటీలను ఆమె ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తే జాతీయ స్థాయికి వారు అభివృద్ధి చెందుతురన్నారు. డీఎ్‌సడీవో భూపతిరావు, పరుశురాముడు, సెక్రటరీ రాఘవేంద్ర, పరమేశ్వరరెడ్డి, మదుసూదన్, కిరణ్ కుమార్, సుభాన్ బాషా, పీఈటీలు పద్మలత, మాధవి, నాగేశ్వరి, గీత, సుమలత పాల్గొన్నారు.