పాక్ దాడులకు భారత్ బెదరదు
ABN , Publish Date - May 16 , 2025 | 11:36 PM
పాకిస్థాన్ దాడులకు బెదిరేదీ లేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 140 కోట్ల ప్రజలకు సూచించారని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
ఆపరేషన్ సిందూర్’ విజయంపై హర్షం
కర్నూలు నగరంలో భారీగా తిరంగ ర్యాలీ
ప్రారంభించిన మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్
కర్నూలు ఎడ్యుకేషన్, మే 16 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్ దాడులకు బెదిరేదీ లేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 140 కోట్ల ప్రజలకు సూచించారని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ విజయానికి సంఘీభావం తెలుపుతూ కర్నూలు నగరంలో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ వద్ద ఈర్యాలీని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాణనష్టం లేకుండా పాకి స్థాన్‌పై దాడిని విజయవంతం చేయడం యావత్ భారతదేశం గర్వపడుతుందన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ విజ యంపై ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ భారతదేశ సైనికులకు మద్దతుగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా తిరంగ ర్యాలీ నిర్వహించడం హర్షణీయమన్నారు. ఆదోని ఎమ్మెల్యే వాల్మీకి పార్థసారధి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జనసేన పాణ్యం నియోజనకవర్గ ఇన్‌చార్జి చింతా సురేష్‌కుమార్ మాట్లాడుతూ వీరజవాన్లకు 140కోట్ల మంది ప్రజల మద్దతు ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, కే.చెన్నయ్య, మధుమోహన ఆచారి, సుధాకర్, రామస్వామి, రామకృష్ణ, డీసీసీబీ చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్, టీడీపీ నాయకులు కేవీ సుబ్బారెడ్డి, జనసేన నాయకులు పీబీవీ సుబ్బయ్య, 17వ వార్డు కార్పొరేటర్ పద్మలతారెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.