వాడవాడలా జెండా పండుగ
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:44 AM
79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరిం చుకొని కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్,, డీఎస్పీ హేమలత, జెండాను ఎగుర వేశారు.
ఆదోని, ఆగస్టు 15 (ఆంధ్ర జ్యోతి): 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరిం చుకొని కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్,, డీఎస్పీ హేమలత, జెండాను ఎగుర వేశారు. టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, పెద్దహరివాణం జడ్పీ ఉన్నత పాఠశాలలో కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, కార్యాలయంలో టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ జెండాను ఎగురవేశారు. నెహ్రూ పాఠశా లలో హెచ్‌ఎం ఫయాజుద్దీన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు జెండాను ఎగురవేశారు. మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ లోకేశ్వరి, కమిషనర్ కృష్ణ జెండాను ఎగురవేశారు. ఆర్ట్స్ కళాశాలలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ విద్యార్థులకు బహు మతులు ప్రదానం చేశారు. పెద్ద హరివాణం జిల్లా పరిషత్ పాఠశాలలో కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప జెండాను ఎగురవేసి మాట్లా డారు. పత్తికొండ బాలికల గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే శ్యాంబాబు వేడుకలకు హాజరయ్యారు. కోర్టులో న్యాయాధికారి జ్యోత్స్నదేవి, కార్యాలయంలో ఆర్డీవో భరత్‌నాయక్ ఆవిష్కరించారు. తుగ్గలి జడ్పీ పాఠశాలలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, మారెల్ల, ఉప్పర్లపల్లి సొసైటీల్లో వైవీ ప్రభాకర్ రెడ్డి, అప్పా వేణుగోపాల్, తహసీ ల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రామాంజినమ్మ జెం డాను ఎగురవేశారు. మద్దికెరలో సర్పంచ్ బండారు సుహాసిని, దేవనకొండలో తహసీల్దార్ రామాం జినేయులు, ఎంపీపీ లక్ష్మిదేవి జెండాను ఎగుర వేశారు. వెల్దుర్తిలో తహసీల్దార్ చంద్రశేఖరవర్మ ఎగుర వేశారు. చిప్పగిరిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, ఏరూరులో మాజీ జడ్పీటీసీ మీనాక్షినాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు.