Share News

నీటి విడుదల పెంపు

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:54 PM

తెలుగుగంగలో అంతర్భాగమైన వెలుగోడు జలాశయం నుంచి నీటి విడుదలను అధికారులు పెంచారు.

నీటి విడుదల పెంపు
వెలుగోడు స్పిల్‌ వే నుంచి విడుదల అవుతున్న నీరు

వెలుగోడు ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): తెలుగుగంగలో అంతర్భాగమైన వెలుగోడు జలాశయం నుంచి నీటి విడుదలను అధికారులు పెంచారు. స్పిల్‌వేకి చెందిన ఐదు గేట్లను తెరిచి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి 12వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. జలాశయం మెయిన్‌ కెనాల్‌ ద్వారా 5,200 క్యూసెక్కులు, స్పిల్‌ వే ద్వారా 10వేల క్యూసెక్కులు, వన్‌ ఆర్‌ తూము ద్వారా పది, నంద్యాల తాగునీటి కోసం 20 క్యూసెక్కుల చొప్పున దిగువకు మొత్తం 15,320 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 263.55 మీటర్ల వద్ద 16.32 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలుగుగంగ అధికారులు తెలిపారు.

Updated Date - Aug 16 , 2025 | 11:54 PM