శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:56 PM
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఈక్రమంలో శనివారం జలాశయం 7 రేడియల్ క్రస్ట్‌గేట్లను ఒక్కొక్కటి 10అడుగుల ఎత్తు తెరిచి సాగర్‌కు స్పిల్‌వే గుండా 1,93,634 క్యూసెక్కులు విడుదల చేశారు.
7 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల
శ్రీశైలం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఈక్రమంలో శనివారం జలాశయం 7 రేడియల్ క్రస్ట్‌గేట్లను ఒక్కొక్కటి 10అడుగుల ఎత్తు తెరిచి సాగర్‌కు స్పిల్‌వే గుండా 1,93,634 క్యూసెక్కులు విడుదల చేశారు. ఎగువన జూరాల స్పిల్‌వే, అలాగే విద్యుదుత్పత్తి అనంతరం, సుంకేసుల డ్యాం నుంచి మొత్తం కలిపి 2,24,166 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం రెండు జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అనంతరం జెన్‌కో అధికారులు 66,280 క్యూసెక్యుల నీటిని దిగువన సాగర్‌కు విడుదల చేశారు. డ్యాం నీటిమట్టం శనివారం సాయంత్రం 6గంటల సమయానికి 884 అడుగులుగా ఉండగా, నీటినిల్వ సామర్థ్యం 210 టీఎంసీలుగా నమెదు అయింది. శ్రీశైలం డ్యాం ఇంజనీర్లు గరిష్ఠ స్థాయి నీటినిల్వలు ఉంచుతూ వరద నీటిని సాగనంపుతున్నారు. డ్యాం గేట్లను తెరవడంతో సందర్శకులు తాకిడి పెరిగింది.