Share News

స్టాఫ్‌ నర్సుల సంఖ్యను పెంచాలి

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:23 AM

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కొక్క పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్సుల సంఖ్యను మూడు నుంచి నాలుగింటికి పెంచాలని ఏపీ గవర్నమెంటు నర్సెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.లీలావతి, సి.బంగారి, డీఎంహెచ్‌వోకు వినతి పత్రం అందజేశారు.

స్టాఫ్‌ నర్సుల సంఖ్యను పెంచాలి
వినతిపత్రం ఇస్తున్న నర్సులు

డీఎంహెచ్‌వోకు నర్సెస్‌ అసోసియేషన్‌ వినతి

కర్నూలు హాస్పిటల్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కొక్క పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్సుల సంఖ్యను మూడు నుంచి నాలుగింటికి పెంచాలని ఏపీ గవర్నమెంటు నర్సెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.లీలావతి, సి.బంగారి, డీఎంహెచ్‌వోకు వినతి పత్రం అందజేశారు. బుధవారం సాయంత్రం డీఎంహెచ్‌వో డా.ఎల్‌.భాస్కర్‌ను కలిసి పలు సమస్యలను వివరించారు. పీహెచ్‌సీలో కేవలం ముగ్గురు స్టాఫ్‌ నర్సులు ఉండటంతో ఏదైనా అత్యవసర పరిస్థితి ఉండి సెలవు పెట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. స్టాఫ్‌ నర్సుల సెలవులో ఉన్నప్పుడు ఆ స్థానంలో ఎంఎల్‌హెచ్‌పీ గానీ సూపర్‌ వైజర్స్‌, ఏఎన్‌ఎం సిబ్బందితో సర్దుబాటు చేయాలని కోరారు.గతంలో డీఎంహెచ్‌వో ఇచ్చిన ఆర్డర్స్‌ను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో నర్సెస్‌ అసోసియేషన్‌ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ జి.శాంతిభవాని, జిల్లా కోశాధికారి ఎన్‌.లక్ష్మినరసమ్మ పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 12:23 AM