జనరల్ మెడిసిన్ పీజీ సీట్లు పెంపు
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:09 AM
కర్నూలు మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్‌లో పీజీ సీట్లు పెరిగాయని కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టి నరసమ్మ తెలిపారు.
తొమ్మిది సీట్లను పెంచిన ఎన్‌ఎంసీ
కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చిట్టినరసమ్మ
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్‌లో పీజీ సీట్లు పెరిగాయని కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టి నరసమ్మ తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మెడిసిన్ విభాగంలో ప్రస్తుతం 20 పీజీ సీట్లు ఉండగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) అదనంగా మరో 9 పీజీ సీట్లును పెంచిందన్నారు. మెడిసిన్‌లో పెరిగిన పీజీ సీట్లు ఈ విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయని అన్నారు. ఈ సీట్లు పెంపు కోసం కర్నూలు జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్, జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ డా.శ్రీరాములును ప్రత్యేకంగా ఢిల్లీకి పంపి ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి పీజీ సీట్లు పెంపు దలకు కృషి చేశారని ప్రిన్సిపాల్ తెలిపారు. ప్లాస్టిక్ సర్జరీ, స్టేట్ క్యాన్సర్ యూనిట్ విభాగాల్లో కూడా అదనపు పీజీ సీట్లు కోసం ప్రతిపాదనలు పంపామని, అవి కూడా వచ్చే అవకాశం ఉంద న్నారు. జనరల్ మెడిసిన్‌లో పెరిగిన సీట్లతో రోగులకు మెరుగైన సేవలు అందుతాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.