Share News

ఇన్‌చార్జీలే దిక్కు..!

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:25 AM

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అందించే శాఖల్లో అత్యంత కీలకమైనది స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ. ప్రస్తుతం ఆ శాఖలో పాలన గాడి తప్పింది. సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. జిల్లా రిజిస్ర్టార్‌తో పాటు, కర్నూలు-1, 2 గుడూరు సబ్‌-రిజిస్ర్టార్లు లేక ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొస్తున్నారు. అత్యధికంగా కర్నూలు, కల్లూరు, నంద్యాల కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్లు జరుగుతాయి. కర్నూలు జిల్లా రిజిస్ర్టార్‌ పోస్టు పది నెలలకు పైగా ఖాళీగా ఉండటంతో సేవలు సరిగా అందక పాలన ముందుకు సాగడం లేదన్న విమర్శలున్నాయి. ప్రతిరోజూ స్లాట్‌ బుకింగ్‌లో అధిక రిజిస్ర్టేషన్లు జరిగే కర్నూలు, ఆదోని, నంద్యాల ఆర్వోల్లో ప్రజల తాకిడి అధికంగా ఉంటుంది. నిత్యం వందలాదిగా రిజిస్ర్టేషన్‌ సేవల కోసం కార్యాలయాలకు వచ్చే క్రయ, విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇన్‌చార్జీలే దిక్కు..!

పది నెలలుగా జిల్లా రిజిస్ర్టార్‌ పోస్టు ఖాళీ

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖలో గాడి తప్పిన పాలన

సరైన సేవలు అందక ఇబ్బందుల్లో ప్రజలు

కల్లూరు, జూలై 16(ఆంధ్రజ్యోతి): కర్నూలు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖలో ఇన్‌చార్జీ లతో పాలన కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అందించే రిజిస్ర్టేషన్‌ శాఖలో జిల్లా రిజిస్ర్టార్‌తో పాటు, కర్నూలు-1 ,2 గుడూరు సబ్‌-రిజిస్ర్టార్లు లేక ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతిరోజూ దాదాపు 400-500 వరకు రిజిస్ర్టేషన్లు జరుగుతుంటాయి. అత్యధికంగా కర్నూలు, కల్లూరు, నంద్యాల కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్లు జరుగుతాయి. కర్నూలు జిల్లా రిజిస్ర్టార్‌ పోస్టు పది నెలలకు పైగా ఖాళీగా ఉండటంతో సేవలు సరిగా అందక పాలన ముందుకు సాగడం లేదన్న విమర్శలు న్నాయి. కర్నూలు డీఆర్‌గా సీహెచ్‌.నాగమల్లేశ్వర్‌ రావు బదిలీ అనంతరం ఇప్పటివరకు రెగ్యులర్‌ జిల్లా రిజిస్ర్టార్‌ను నియమించకపోవడంతో పాలన పడకేసింది. నిత్యం వందలాదిగా రిజిస్ర్టేషన్‌ సేవల కోసం కార్యాలయాలకు వచ్చే క్రయ, విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈఏడాది లక్ష్యం రూ.399 కోట్లు

కర్నూలు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 399 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నారు. కర్నూలు జిల్లాలో 11 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. అందులో కర్నూలు 1, 2, కల్లూరు, గుడూరు, కోడుమూరు, మంత్రాలయం, ఆదోని, ఆస్పరి, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు ఉన్నాయి. వాటిలో రిజిస్ర్టేషన్‌ శాఖ అధిక ఆదాయం కర్నూలు-1, 2 అలాగే కల్లూరు నుంచి వస్తోంది. కీలకమైన స్థానాల్లో రెగ్యులర్‌ సబ్‌-రిజిస్ర్టార్‌లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

2024లో నిర్వహించిన బదిలీల్లో..

గత పది నెలలుగా కర్నూలు జిల్లా రిజిస్ర్టార్‌ పోస్టు ఖాళీగా ఉంది. 2024లో ప్రభుత్వం నిర్వహించిన సాధారణ బదిలీల్లో డీఆర్‌ సీహెచ్‌.నాగ లింగేశ్వరరావు విశాఖపట్నం బదిలీపై వెళ్లారు. ఆతర్వాత కోన్నిరోజులు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ కర్నూలు డీఐజీ పీజీయస్‌. కళ్యాణి ఇన్‌చార్జ్‌ డీఆర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత చెన్నకేశవ రెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమించగా కొద్దిరోజులు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఆ తర్వాత సెలవుతో వెళ్లారు. ఆయన స్థానంలో అనంతపురానికి చెందిన భార్గవ్‌కు కర్నూలు డీఆర్‌గా ఇన్‌చార్జ్‌ బాధ్యతలి వ్వగా కొన్నిరోజులు మాత్రమే పనిచేశారు. ప్రస్తుతం నంద్యాల డీఆర్‌ జానకిదేవికి కర్నూలు డీఆర్‌గా ఇన్‌చార్జ్‌ బాధ్య తలు అందించారు. తమ సమస్యల పరిష్కారం కోసం డీఆర్‌ను కలిసేందుకు వచ్చే ప్రజలకు సరైన సేవలు అందడంలేదు. ఇలా కీలకమైన జిల్లా రిజిస్ర్టార్‌ పోస్టును భర్తీ చేయడంలో అధికారులు ప్రభుత్వం విఫలమయ్యారని క్రయ, విక్రయదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సేవలు అందక వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.

ప్రజలు సతమతం..

కర్నూలు జాయింట్‌ సబ్‌-రిజిస్ర్టార్‌ కార్యాల యంలో రెగ్యులర్‌ అదికారులు లేకపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రతిరోజూ స్లాట్‌ బుకింగ్‌లో అధిక రిజిస్ర్టేషన్లు జరిగే కర్నూలు, ఆదోని, నంద్యాల ఆర్వోల్లో ప్రజల తాకిడి అధికంగా ఉంటుంది. సీనియర్‌ అసిస్టెంట్‌కు సబ్‌-రిజిస్ర్టా ర్‌గా కర్నూలు ఇన్‌చార్జ్‌ ఇవ్వడం, ఇద్దరు జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్లు ఉండాల్సిన చోట ఒక్కరే పనిచేస్తుండటంతో సహజంగానే ఒత్తిడి అధికంగా పడుతోంది. అటు ఆదోనిలో డిప్యుటేష న్‌పై సునంద విధులు నిర్వహిస్తున్నారు. గుడూరులో ఇన్‌చార్జ్‌ సబ్‌-రిజిస్ర్టార్‌ విధుల్లో ఉన్నారు. నంద్యాల పరిధిలో ఆవుకు, బనగానపల్లె, నంద్యాల ఆర్వోలకు రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ర్టార్ల స్థానంలో ఇన్‌చార్జ్‌లే ఉన్నారు.

ప్రభుత్వానికి నివేదించాం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టుల ఖాళీలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపాం. కర్నూలు-1, 2, గుడూరు, అవుకు, బనగానపల్లె, నంద్యాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో కీలకమైన కర్నూలు ఆర్వోలో రెండు రెగ్యులర్‌ అధికారుల కోసం పలు పర్యా యాలు ప్రభుత్వానికి లేఖలు రాశాం. ప్రస్తుతం సాధారణ బదీలలకు అవకాశం లేదు. మరోసారి ప్రభుత్వానికి లేఖ రాస్తాం. పీజీయస్‌.కళ్యాణి, డీఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ, కర్నూలు

Updated Date - Jul 17 , 2025 | 12:25 AM