ఇన్‌చార్జిలే దిక్కు..
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:02 AM
కర్నూలు జిల్లా రిజిస్ర్టార్ పోస్టు ఖాళీగా దర్శనమిస్తోంది. జిల్లా రిజిస్ర్టార్‌ను నియమించడంలో ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దాదాపు 11 నెలలుగా కర్నూలు జిల్లా రిజిస్ర్టార్ పోస్టు ఖాళీగా ఉండటంతో ఫైల్స్ పేరుకుపోయి పాలన ముందుకు సాగడం లేదు.
11 నెలలైనా భర్తీ కాని జిల్లా రిజిస్ర్టార్ పోస్టు
పేరుకుపోయిన ఫైళ్లు
ముందుకు సాగని పాలన
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
కల్లూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా రిజిస్ర్టార్ పోస్టు ఖాళీగా దర్శనమిస్తోంది. జిల్లా రిజిస్ర్టార్‌ను నియమించడంలో ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దాదాపు 11 నెలలుగా కర్నూలు జిల్లా రిజిస్ర్టార్ పోస్టు ఖాళీగా ఉండటంతో ఫైల్స్ పేరుకుపోయి పాలన ముందుకు సాగడం లేదు. ఇన్‌చార్జిలతో కాలం వెల్లదీస్తున్నారు. రెగ్యులర్ రిజిస్ర్టార్ నియమించడంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా రిజిస్ర్టార్ ఫేషీలో ఫైళ్లు ముందుకు కదలక, సమస్యలకు పరిష్కారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.
కర్నూలు జిల్లా రిజిస్ర్టార్ పోస్టు ఖాళీగా దర్శనమిస్తోంది. జిల్లా రిజిస్ర్టార్‌ను నియమించడంలో ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దాదాపు 11 నెలలుగా కర్నూలు జిల్లా రిజిస్ర్టార్ పోస్టు ఖాళీగా ఉండటంతో ఫైల్స్ పేరుకుపోయి పాలన ముందుకు సాగడం లేదు.
కర్నూలు జిల్లా రిజిస్ర్టార్ ఫేషీలో ఫైళ్లు పేరుకుపోతున్నాయని వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ డీఆర్ లేకపోవడంతో ఇన్‌చార్జ్‌లకు భాధ్యత అప్పగించారు. ఈ తలనొప్పులు మాకెందుకులే అని ఇన్‌చార్జ్ డీఆర్‌గా పనిచేస్తున్న అధికారులు ప్రజలు, వినియోగదారుల సమస్యలు పరిస్కరించడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దాదాపు 11 నెలలుగా డీఐజీతో కలిసి నలుగురు అధికారులు జిల్లా రిజిస్ర్టార్‌గా పనిచేసినా ఏఒక్క పని జరగలేదని ప్రజలు వాపోతున్నారు. సొసైటీ నూతన దరఖాస్తులు, అనుమతులు, చిట్‌ఫండ్ కొత్త దరఖాస్తులు, రెన్యూవల్ నిలిచిపోయాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎడిట్ ఇన్‌డెక్స్ (ఈసీల్లో తప్పుల సవరణ జిల్లా వ్యాప్తంగా)జరగడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలో జరిగే అవకతవకలు, తప్పుడు, ఫేక్ రిజిస్ర్టేషన్లపై ప్రజలు ఇచ్చే పిర్యాదులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కర్నూలు జిల్లా స్టాంపులు రిజిస్ర్టేషన్ల శాఖ డీఐజీ, ఐజీ అధికారులు కూడా రెగ్యులర్ డీఆర్‌ను నియమించడంలో విఫలం అయ్యారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
ఇంకెన్నాళ్లు ఇలా..
2024 సెప్టెంబరు 22న కర్నూలు జిల్లాకు సీహెచ్.నాగమల్లీశ్వరరావు డీఆర్‌గా విధుల్లో చేరారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో ఆయన విశాఖపట్నం డీఆర్‌గా వెళ్లారు. కొంతకాలం డీఐజీ కళ్యాణి ఇన్‌చార్జి భాధ్యతలు నిర్వహించారు. తర్వాత చెన్నకేశవరెడ్డికి ఇన్‌చార్జ్ డీఆర్‌గా అప్పగించారు. తాత్కా లికంగా సేవ లందించి సెలవుపై వెళ్లారు. ఆతర్వాత అనంతపురం జిల్లా డీఆర్ భార్గవ్‌కు ఇన్‌చార్జ్ భాధ్యతలు ఇవ్వగా అరకొరగా పనిచేస్తూ అటువైపు రాలేదని ప్రజలు ఆందోళన చెందారు. ఆయన స్థానంలో నంద్యాల డీఆర్ జానకీదేవిని కర్నూలు డీఆర్‌గా ఇన్‌చార్జ్ ఇవ్వగా అడపాదడపా ప్రజలకు దర్శనమిచ్చారు. మళ్లీ ఆమె స్థానంలో అనంతపురం జిల్లా డీఆర్ భార్గవ్‌ను కర్నూలు డీఆర్‌గా ఇన్‌చార్జ్ ఇవ్వడంతో ప్రజలే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వినియోగదారుల పట్ల స్టాంపులు రిజిస్ర్టేషన్ శాఖ అధికారులకు చిత్తశుద్ధి లేదని రెగ్యులర్ రిజిస్ర్టార్‌ను నియమించడంతో మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజలు, క్రయ విక్రయదారులు సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కర్నూలుకు రెగ్యూలర్ జిల్లా రిజిస్ర్టార్‌ను నియమించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.