Share News

ముందుగానే..!

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:47 AM

కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వరాలకు కృష్ణానది పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది.

ముందుగానే..!

నేడు శ్రీశైలం డ్యాం నుంచి నీటి విడుదల

గేట్లను ఎత్తనున్న సీఎం చంద్రబాబు

ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం

ఇప్పటికే నీటి లభ్యత.. 192.5300 టీఎంసీలు

880.80 అడుగులకు చేరిన నీటి మట్టం

మల్లన్న దర్శనం తర్వాత కృష్ణమ్మకు సీఎం జలహారతి

నంద్యాల, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వరాలకు కృష్ణానది పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా నెల రోజుల ముందుగానే ఇప్పటికే జలాశయంలో నీటి లభ్యత 192.5300 టీఎంసీలు ఉండగా.. నీటి మట్టం 880.80 అడుగులకు చేరింది. వీటితో పాటు విద్యుత్‌ ఉత్పాదన కింద జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు 67,433 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జలాశయంలోకి పెద్దఎత్తున నీరు వచ్చి చేరడంతో శ్రీశైల జలాశయంలో కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైల జలాశయంలో ఇప్పటికే సుమారు 193 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు గేట్లు ఎత్తివేసేందుకు సిద్ధమయ్యారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జలాశయం గేట్లు ఎత్తి కృష్ణా జలాలను దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు సీఎం చేతులు మీదుగా కృష్ణా జలాలను విడుదల చేయడం ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు కూటమి శ్రేణుల్లో ఆనందోత్సవం మొదలైంది.

ఎగువ నుంచి భారీగా..

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహాం జోరందుకుంది. దీంతో జలాశయం పూర్తి లెవల్‌(ఎఫ్‌ఆర్‌ఎల్‌) 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగులకు చేరింది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 1.80 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 23 వేల క్యూసెక్కులు రాయలసీమ ప్రాజెక్టులకు వెళ్తున్నాయి. మరో 70 వేలు కుడి ఎడమ జల విద్యుత్‌ ఉత్పాదన కింద నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఎగువన కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాలు దాదాపుగా నిండిపోయాయి. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగ భద్ర నుంచి 65 వేల క్యూసెక్కుల మేర శ్రీశైలానికి జలాలు వచ్చి చేరుతున్నాయి. తుంగభద్రలో ఒక గేటు బలహీనంగా ఉండటంతో పూర్తి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలకు గాను. ప్రస్తుతం 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయడానికి జలాశయం ఇంజనీర్లు నిర్ణయించారు. తుంగ భద్ర నీటి నిల్వ ప్రస్తుతం 78 టీఎంసీలకు చేరింది. సోమవారం సాయంత్రం ఎగువ నుంచి వచ్చే 73 వేల క్యూసెక్కులను దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తారు.

సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు

శ్రీశైల జలాశయం నీటి విడుదల కోసం ఏకంగా సీఎం చంద్ర బాబు రావడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం సాయం త్రం సీఎం పర్యటన వివరాలను సీఎంఓ వెల్లడించింది. దీంతో నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి, కర్నూలు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌, ఎస్పీ అదిరాజ్‌ సింగ్‌ రాణాలతో పాటు జలాశయం ఎస్‌ఈ రామచంద్రమూర్తి అప్రమత్తమయ్యారు. వెంటనే సీఎం పర్యటన పనుల్లో నిమగ్నమయ్యారు. సీఎంతో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉమ్మడి జిల్లా మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్దన్‌ రెడ్డి, టీజీ భరత్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇరిగేషన్‌ అధికారులు హాజరుకానున్నారు.

పటిష్ట భద్రత

సీఎం చేతులు మీదుగా శ్రీశైలం జలాశయం నీటి విడుదల నేప థ్యంలో కర్నూలు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌, ఎస్పీ అధిరా జ్‌సింగ్‌ రాణా నేతృత్వంలో 1,300 మంది పోలీసులతో భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం నుంచే భద్ర తను కట్టుదిట్టం చేశారు. కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు, 9మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 75మంది ఎస్‌ఐలు, 180మంది హెడ్‌ కాని స్టేబుళ్లు మొత్తం 1,300 మందితో సీఎం పర్యటనకు సిబ్బందిని సమకూర్చారు. సీఎం భద్రతా సిబ్బంది కూడా నిఘా ఉంచారు. ఇదిలా ఉండగా ఏపీ, తెలంగాణ నుంచి శ్రీశైలానికి వచ్చే భక్తులకు ఉదయం 9 గంటల నుంచి మధ్నాహ్నం 2 గంటలకు వరకు పోలీ సులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సీఎం పర్యటన నేపథ్యంలో దో ర్నాలలో కాసేపు సాధారణ వాహనాలను నిలుపుదల చేస్తారు. అదే విధంగా దేవస్థానం, డ్యాం పరిధిలోనూ ఆంక్షలు కొనసాగుతాయి.

11 గేట్లు ఎత్తివేత..!

శ్రీశైలం జలాశయంలో ఉన్న 12 క్రస్ట్‌ గేట్లలో 11 గేట్లను సీఎం చంద్రబాబు ఎత్తనున్నారని ఆ శాఖ వర్గాల నుంచి తెలిసింది. ఇటీవల సాగునీటి రంగ సలహాదారు, గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు సైతం ఇటీవల పర్యటించి 12 గేట్లలో 10 గేటు స్వల్పంగా దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ఇదే క్రమంలో మరో ఐదేళ్లకయినా కొత్త గేట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా 6,7వ గేటు కింద ఉన్న ప్లంజ్‌ పూల్‌ కొంత దెబ్బతినడంతో ఆ గేట్లను ఎత్తుతారా..? లేదా అన్న సందేహాలు లేకపోలేదు. ప్రవాహాం జోరందుకుంది. దీంతో జలాశయం పూర్తి లెవల్‌(ఎఫ్‌ఆర్‌ఎల్‌) 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగులకు చేరింది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 1.80 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 23 వేల క్యూసెక్కులు రాయలసీమ ప్రాజెక్టులకు వెళ్తున్నాయి. మరో 70 వేలు కుడి ఎడమ జల విద్యుత్‌ ఉత్పాదన కింద నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఎగువన కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాలు దాదాపుగా నిండిపోయాయి. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగ భద్ర నుంచి 65 వేల క్యూసెక్కుల మేర శ్రీశైలానికి జలాలు వచ్చి చేరుతున్నాయి.

Updated Date - Jul 08 , 2025 | 12:47 AM