నా పనితనం చూపిస్తా..
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:35 PM
అధినేత చంద్రబాబు, యువనేత నారాలోకేశ్ నమ్మకాన్ని నిలబెడుతూ తన పనితనం నిరూపించుకొనేలా పని చేస్తానని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.
అధ్యక్ష పదవి పునర్జన్మ లాంటిది
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ
కర్నూలు అర్బన్ , డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): అధినేత చంద్రబాబు, యువనేత నారాలోకేశ్ నమ్మకాన్ని నిలబెడుతూ తన పనితనం నిరూపించుకొనేలా పని చేస్తానని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిక్కారెడ్డి నుంచి జిల్లా అధ్యక్ష పదవిని గుడిసె కృష్ణమ్మ పదవి స్వీకరించారు. ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు యాదవ్ బాధ్యతలు తీసుకున్నారు. అంతక ముందు జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆమె మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేష్ నివాసానికి వెళ్లి ఆయన ఆశీర్వాదం స్వీకరించి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా 11వ అధ్యక్ష బాధ్యత మహిళకు కట్టబెట్టడం.. ఊహించ లేదని, బీసీలపై టీడీపీకి ఉన్న నిబద్ధత ఏమిటో మరోసారి నిరూపణ అయిందన్నారు. కర్నూలు చరిత్రలో ఎందరో ఉద్దండులు అధ్యక్ష బాధ్యతల్లో పని చేశారని, అలాంటి పదవి తనను వరించడం పునర్జన్మ లాంటిందన్నారు. ప్రతి కార్యకర్త, నాయకులతో సమన్వయంతో కలిసి పని చేసి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల సమయాన జిల్లా అధ్యక్ష బాఽధ్యతలు అధిష్టానం అప్పగించిందని, జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలిపించడంలో, పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించడంలో శక్తి వంచన లేకుండా కృషి చేశానని అన్నారు. అధ్యక్ష, కార్యదర్శుల పదవులు బీసీలకు ఇచ్చిందని అన్నారు. పార్టీలో బీసీలు, మహిళల ప్రాఽధాన్యం కొత్తేమీ కాదన్నారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం పట్ల జిల్లాలో హర్షం వ్యక్తం అవుతోందన్నారు. సీనియర్ నాయకుడు మీనాక్షి నాయుడు మాట్లాడుతూ 2004లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అవకాశం కల్పించిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ అధికారంలో ఉన్న లేక పోయినా పార్టీకి నమ్మన నాయకురాలిగా గుడిసె క్రిష్ణమ్మ పని చేశారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు కొత్త నాయకత్వం ఏర్పాటు శుభపరిణామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటే శ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మంత్రాలయం ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి, కార్పొరేషన్ల డైరెక్టర్లు సంజీవలక్ష్మి, ఽథరూర్ జేమ్స్, పోతురాజు రవికుమార్, మారుతి శర్మ, కార్పొరేటర్ పద్మలతా రెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బాస్, నాయకులు సత్రం రామకృష్ణుడు, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.