Share News

చిన్నారులకు అస్వస్థత

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:07 AM

మండలంలోని నాగులాపురంలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రం-2లో 5 సంవత్సరాల్లోపు పిల్లలు 31 మంది ఉన్నారు. సోమవారం 26 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు అంగన్‌వాడీ సిబ్బంది పుష్ప పిల్లలం దరికీ అంగన్‌వాడీ పాలు అందించారు. మధ్యాహ్నం 12;30గంటలకు అన్నంతోపాటు దోసకాయ పప్పును పిల్లలకు పెట్టింది. మధ్యాహ్నం 2;30 గంటలకు 8 మంది మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు ఏడవడం ప్రారంభించారు.

 చిన్నారులకు అస్వస్థత
చికిత్స పొందుతున్న చిన్నారులు

ఆదోని రూరల్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నాగులాపురంలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రం-2లో 5 సంవత్సరాల్లోపు పిల్లలు 31 మంది ఉన్నారు. సోమవారం 26 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు అంగన్‌వాడీ సిబ్బంది పుష్ప పిల్లలం దరికీ అంగన్‌వాడీ పాలు అందించారు. మధ్యాహ్నం 12;30గంటలకు అన్నంతోపాటు దోసకాయ పప్పును పిల్లలకు పెట్టింది. మధ్యాహ్నం 2;30 గంటలకు 8 మంది మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు ఏడవడం ప్రారంభించారు. అమ్మా కడుపునొప్పి అంటూ ఏకధాటిగా వాంతులు చేసుకోవడంతో పాటు అ క్కడే కుప్పకూలి పోయారు. విషయం గ్రహించిన పుష్ప హెల్త్‌ అసిస్టెంట్‌ వద్ద మందులు తెచ్చి వేసిం ది. ఆపది మంది చిన్నారులు వాంతులు చేసుకుం టూ కడుపునొప్పితో ఏడుస్తుండడంతో వారి ఇళ్లకు వదిలి చేయి దులుపేసుకున్నారు. ఆ పిల్లలు ఇంటికి వెళ్లినప్పటికీ పిల్లలు వాంతులు చేసుకుంటూ కడుపునొప్పితో ఏడుస్తుండడంతో తల్లిదండ్రులు స్థానిక ఆర్‌ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. సీడీపీవో ఢిల్లీశ్వరి గ్రామానికి చేరుకుని స్థానికంగా ఉండే హెల్త్‌ సిబ్బందితో వైద్య పరీక్షలు చేయించారు. విషయం తెలుసుకున్న సబ్‌కలెక్టర్‌ అజయ్‌కుమార్‌ రాత్రి 8 గంటల సమయంలో గ్రామానికి చేరుకుని పిల్లల ఆరోగ్యం గురించి ఆరాతీశారు. వీరిలో మూ డేళ్ల వైశాలి, నాలుగేళ్ల వయస్సు గల సుదర్శన్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో రాత్రి 10 గంటలకు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాలుకా సీఐ నల్లప్ప, ఎస్‌ఐ రామాంజనేయులు ఆసుపత్రికి చేరుకుని పిల్లల ఆరోగ్యంపై ఆరాతీశారు. అపరి శుభ్రమైన పాత్రల్లో, కుళ్లిపోయిన కూరగాయలతో వంటలు చేయడంతో పిల్లలకు వడ్డించడంతోనే ఇలా జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Nov 11 , 2025 | 01:07 AM