Share News

నీటిని వృథా చేస్తే కొళాయి కనెక్షన కట్‌: కమిషనర్‌

ABN , Publish Date - May 21 , 2025 | 12:31 AM

నగరంలో ఎవ్వరైనా తాగునీటిని వృథా చేస్తే సంబంధిత గృహ, వాణిజ్య సముదాయాలకు కొళాయి కనెక్షన కట్‌చేయాలని కార్పొరేషన కమిషనర్‌ ఎస్‌.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు.

నీటిని వృథా చేస్తే కొళాయి కనెక్షన కట్‌: కమిషనర్‌
నీటి వృథాను పరిశీలిస్తున్న కమిషనర్‌ రవీంద్రబాబు

కర్నూలు న్యూసిటీ, మే 20(ఆంధ్రజ్యోతి): నగరంలో ఎవ్వరైనా తాగునీటిని వృథా చేస్తే సంబంధిత గృహ, వాణిజ్య సముదాయాలకు కొళాయి కనెక్షన కట్‌చేయాలని కార్పొరేషన కమిషనర్‌ ఎస్‌.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన బాపూజీ నగర్‌, పాతబస్టాండ్‌, సి.క్యాంపు రైతుబజార్‌ ప్రాంతాల్లో పర్యటించారు. బాపూ జీ నగర్‌లో డ్రైనేజీ కాలువలో మురుగునీరు ప్రవాహం అధికా రంగా ఉండటంతో సిల్ట్‌ తొలగింపునకు అవసరమైన చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. అదే ప్రాంతంలో కొందరు తాగు నీటిని వృథా చేస్తుండటాన్ని గమనించిన కమిషనర్‌ స్థానిక ప్రజలకు నీటిని సక్ర మంగా వాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి, కొండారెడ్డి బురుజు సమీ పంలోని అన్న క్యాంటీనలను కమిషనర్‌ పరిశీలించారు. ఆయన వెంట ఆరోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, శానిటేషన సూపర్‌వైజర్‌ నాగ రాజు, శానిటరీ ఇన్సపెక్టర్లు వలి, అనిల్‌ ఉన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:31 AM