‘కుడా’ అనుమతి లేకుంటే కూల్చేస్తాం
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:16 PM
వెల్దుర్తిలో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాలను, వాణిజ్య సముదాయాలను ‘కుడా’(కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు.
చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు
వెల్దుర్తి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): వెల్దుర్తిలో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాలను, వాణిజ్య సముదాయాలను ‘కుడా’(కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వాణిజ్య సముదాయానికి బీపీఎస్, లేఔట్ అయితే ఎల్‌ఆర్‌ఎస్ అనుమతులు తీసు కోవాలని అన్నారు. ఇంటి నిర్మాణానికి అయితే గ్రామపంచాయతీ అనుమతి తీసుకుంటే సరిపోతుందని అన్నారు. ఇంటి నిర్మాణానికి అని చెప్పి వాణిజ్య సముదాయాలు, షాపులు నిర్మిస్తున్నా రన్నారు. షాపులు కట్టి వ్యాపారాలకు బాడుగలకు ఇచ్చి వేలకు వేలు సొమ్ము చేసుకుంటున్నారు. అప్రువల్ లేకుండా నిర్మించిన, నూతనంగా నిర్మిస్తున్న 21 మందికి నోటీసులు అంద జేశామన్నారు. రాజకీయ నాయకు లతో ఫోన్లు చేయిస్తామంటే వినమని అన్నారు. అప్రువల్ తీసుకోకుండా తాత్సరం చేస్తే.. అలాంటి నిర్మాణాలను కూల్చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ నాథ్, సిబ్బంది పాల్గొన్నారు.