అదుపు తప్పితే...
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:44 PM
అడుగులో అడుగువేస్తూ ఎక్కడ పడిపోతామో అనుకుంటూ అనుక్షణం భయం భయంగా వస్తున్న వీరు నిత్యం ఇలా సాహసం చేస్తేనే గమ్యస్థానాలకు చేరుకోగలరు.
అడుగులో అడుగువేస్తూ ఎక్కడ పడిపోతామో అనుకుంటూ అనుక్షణం భయం భయంగా వస్తున్న వీరు నిత్యం ఇలా సాహసం చేస్తేనే గమ్యస్థానాలకు చేరుకోగలరు. చాగలమర్రి మండలంలోని గోపాయపల్లె రహదారి వద్దగల అడ్డవాగును ప్రజలు దాటాలంటే ఇలా సర్కస్ ఫీట్లు చేయక తప్పదు. వాగు సమీపంలో 2,500 ఎకరాల్లో కంది, మినుము, మొక్కజొన్న, మల్లెతోటలు ఉన్నాయి. ఈ పంట పొలాలను నమ్ముకొని సుమారు 500 మంది రైతులు, కూలీలు జీవిస్తున్నారు. వర్షపు నీరు, టీజీపీ లీకేజీ నీరు కలిసి అడ్డవాగుకు చేరడంతో రైతులు, కూలీలు వాగు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అడ్డవాగుపై వంతెన లేకపోవడంతో ఇలా వాగుపై మూడు విద్యుత్ స్తంభాలను అడ్డుగా వేసి దాటుకుంటూ వెళ్తున్నారు.
- చాగలమర్రి (ఆంధ్రజ్యోతి)