Share News

మార్గదర్శకులను గుర్తించండి

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:49 PM

స్వర్ణాంధ్ర 2047 విజన్‌ అమలులో భాగంగా నియోజకవర్గ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌, పీ-4 కింద మార్గదర్శకులను గుర్తించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అధికారులను ఆదేశించారు.

మార్గదర్శకులను గుర్తించండి
మాట్లాడుతున్న మంత్రి ఫరూక్‌

న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల టౌన్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర 2047 విజన్‌ అమలులో భాగంగా నియోజకవర్గ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌, పీ-4 కింద మార్గదర్శకులను గుర్తించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల మున్సిపల్‌ కార్యాలయంలో కలెక్టర్‌ రాజకుమారి అధ్యక్షతన అభివృద్ధి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నంద్యాల నియో జకవర్గంలో అవసర మైన వనరులను గుర్తించి అభివృద్ధి చేయాలన్నారు. పీ-4 విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పేదలు, ధనికుల మధ్య అంతరాలు తగ్గించేలా చేయాల న్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో విద్యా వ్యవసాయం, పాడి పరిశ్రమ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మహానంది మండలం అభివృద్ధి చెందుతున్నంత త్వరగా గోస్పాడు మండలం ఎందుకు అభివృద్ధి చెందడంలేదని ప్రశ్నించారు. దీనికి అధికారుల వద్ద సమాధానం లేక మౌనంగా ఉండిపోయారు. మండలాల వారిగా ఆదాయం, అభివృద్ధి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చల్లా విశ్వనాథ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 11:49 PM