హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు భూమిని గుర్తించండి
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:25 PM
: నగరంలోని ఏ, బీ, సీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తగిన భూమిని గుర్తించాలని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు మంత్రి టీజీ భరత్ ఆదేశం
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఏ, బీ, సీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తగిన భూమిని గుర్తించాలని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు భూమి గుర్తింపు అంశంపై సోమవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో మంత్రి టీజీ భరత్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. సమావేశంలో కలెక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డీఆర్వో వెంకట నారాయణమ్మ పాల్గొన్నారు.