Share News

నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:33 AM

నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా
భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

రూ.1.80 కోట్లతో ఇరిగేషన పనులకు భూమి పూజ

డోన టౌన, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గూండాల గ్రామంలో రూ.1.80 కోట్లతో పంప్‌హౌస్‌, చెక్‌డ్యాం నుంచి కొత్తబురుజు, చిన్నపూదెళ్ల గ్రామాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కోట్ల మా ట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంద న్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామ కృష్ణ, ఓబు లాపురం శేషిరెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు యాదవ్‌, ఆలేబాదు పరమేష్‌, ఆలంకొండ గిడ్డారెడ్డి, ఆలంకొండ గిరిప్రసాద్‌ రెడ్డి, గుండాల నారాయణస్వామి, గుండాల శ్రీను, రంజిత కిరణ్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

మైనార్టీల అభివృద్ధికి కృషి: మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌లో ఆల్‌ మైనార్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన ఆఫ్‌ ఆంధ్రప్రదేశ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బాలికల మదరసాకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మదరసాకు నిర్వహణకు ఎమ్మెల్యే కోట్ల రూ.లక్ష విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌గౌడు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన కోట్రికేహరికిషన, మైనార్టీ నాయ కులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

పంచాయతీలను విస్మరించిన వైసీపీ: కోట్ల

ప్యాపిలి: వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పూర్తిగా విస్మ రించిందని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి విమర్శించారు. శనివారం మండలంలోని నల్లమేకలపల్లి గ్రామంలో రూ.32 లక్షలతో కొత్తగా నిర్మించనున్న పంచాయతీ భవనానికి ఆయన భూమి పూజ చేశారు. కోట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిదుల లేమితో గ్రామపంచా యతీల అభివృద్ధి కుంటుపడిందన్నారు. అనంతరం పట్టణంలోని కేజీ బీవీలో అదనపు గదుల నిర్మాణం కోసం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక మండల పరిషత కార్యాల యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన నాగేశ్వరరావు యాదవ్‌, ప్రభాకర్‌రెడ్డి, సుదర్శన, రాజా నారాయణమూర్తి, సత్యం చౌదరి, పరమేష్‌, టి.శ్రీనివా సులు, ఖాజాపీర్‌, రాజశేఖర్‌నాయుడు, మధు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 12:33 AM