మకాం మార్చాల్సిందే..!
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:24 PM
ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్‌ను కేటాయిస్తారు. ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్‌లో ఏళ్ల తరబడి అక్రమార్కులు పాగా వేశారు.
ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్ ఖాళీ చేయాల్సిందే
అద్దెలకు ఇచ్చి జేబులు నింపుకున్న బినామీలు
నివాసాల్లో ఉన్న అక్రమార్కులకు నోటీసులు
సెప్టెంబర్ 7వ తేదీ వరకే గడువు
నీరు, విద్యుత్ కట్ చేయాలని కలెక్టర్ ఆదేశం
ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్‌ను కేటాయిస్తారు. ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్‌లో ఏళ్ల తరబడి అక్రమార్కులు పాగా వేశారు. రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, నగరపాలక సంస్థల సంయుక్త పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు ఇంతకాలం రెచ్చిపోయారు. ఏ, బీ, సీ క్యాంప్‌ల పేరుతో ఉన్న సుమారు వెయ్యికి పైగా ప్రభుత్వ భవనాలు దుర్వినియోగం అవుతూ వచ్చాయి. సెప్టెంబర్ 7వ తేదీ లోపు ఖాళీ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఖాళీ చేసి వాటిని వెంటనే మరమ్మతులు చేయించేందుకు అవసరమైన ప్రణాళికలతో రూపొందించి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు అధికారులు చెబుతున్నారు. అక్రమ నివాసాల్లో ఉన్నవారికి నీరు, విద్యుత్ సరఫరా వేంటనే నిలిపి వేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కర్నూలు అర్బన్ , ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్‌లో ఏళ్ల తరబడి అక్రమార్కులు పాగా వేశారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా మారిందన్న ఫిర్యాదులను జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. రెవెన్యూ విభాగంలోని కొందరు ఉద్యోగులు, రిటైర్టు ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల అనుచరులు మకాం వేశారు. పర్యవేక్షణ లేకపోవడంతో వారే ఏళ్ల తరబడి వారి ఆధీ నంలోకి వెళ్లాయి. కొందరు అద్దెలకు ప్రభుత్వ భవనాలను దుర్విని యోగం చేస్తున్నారు. రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, నగరపాలక సంస్థల సంయుక్త పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు ఇంత కాలం రెచ్చిపోయారు. ఇంతా కాలం ప్రశ్నించే వారు లేక పోవడంతో ఏ, బీ, సీ క్యాంప్‌ల పేరుతో ఉన్న సుమారు వెయ్యికి పైగా ప్రభుత్వ భవనాలు దుర్వినియోగం అవుతూ వచ్చాయి.
91ఎకరాల్లో 1072 క్వార్టర్లు
1953-1956లో 91ఎకరాల విస్తీర్ణంలో 1072 క్వార్టర్స్ నిర్మాంచారు. ఏ, బీ, సీ క్యాంపుల్లో ఏ176, బీ 634, సీ 103, డీ 51, ఈ 10, ఎంఐజీ 5 పేర్లతో క్వార్టర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఫారెస్ట్, ఫిషరీస్ కాంపౌండ్‌లలో టైపు 40, బీ టైపు 14, సీ టైపు 6, ఈ టైపు రెండు, ఎఫ్ టైపు ఒకటి ఉన్నాయి. 68 క్వార్టర్లు శిఽథిలావస్థకు చేరుకున్నాయి.
మరమ్మతులు శూన్యం..
క్వార్టర్స్‌లో నివాసాలు ఉంటున్న ఉద్యోగుల నుంచి హెచ్ ఆర్‌ఏ కింద వేతానాల్లో కోత విధిస్తున్న సొమ్మును రెవెన్యూ శాఖ ఖజానాకు జమచేస్తుంది. కానీ మరమ్మతులకు సం బంధించి పట్టించుకోకపోవడంతో పలు క్వార్టర్స్ శిఽథిలావస్థకు చేరకుంటున్నాయి.
క్వార్టర్స్ ఇలా..
ఏ, బీ, సీ క్వార్టర్స్‌లో రెవెన్యూ ఉద్యోగి కబ్జాలో 14ఇళ్లు, మరో రిటైర్డ్ ఉద్యోగి చేతిలో 18 ఇళ్లు, వైసీపీకి చెందిన ఓ మహిళా నేత, మరో ఇద్దరు అనుచరుల చేతుల్లో మరో 60 ఇళ్లు, కుల సంఘాలు, ఇతర అసోసియేషన్ల పేరుతో మరో 80ఇళ్లలో కొందరు అక్రమంగా నివాసాలు ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. బినామీలు ఇళ్లను అద్దెకు ఇచ్చి నెలానెలా అద్దెల రూపంలో జేబులు నింపుకుంటున్నారు.
ఆరు నెలలుగా సాగిన సర్వేలు
రెవెన్యూ, అర్ అండ్‌బీ, నగర పాలక సంస్థ, విద్యుత్ శాఖ, పోలీసులు సంయుక్తంగా సర్వేలు నిర్వహించారు. 496 క్వార్టర్లలో అక్రమంగా నివాసం ఉంటున్నారని నివేదికను కలెక్టర్‌కు నివేదించారు. స్పందించిన కలెక్టర్ ఇటీవల జిల్లా అధికారులతో సమీక్షించి అందులో ఉన్నవారిని సెప్టెంబర్ 7వ తేదీలోపు ఖాళీ చేయించాలని ఆదేశించారు. ఆపై 8వ తేదీ నుంచి మూడు బృందాలుగా ఏర్పడి అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని, తదుపరి భవానాలను రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పోలీసు పర్య వేక్షణలో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఖాళీ చేసి వాటిని వెంటనే మరమ్మతులు చేయించేందుకు అవసరమైన ప్రణాళికలతో రూపొందించి నివేదిక ఇవ్వాలని సూచించినట్లు అధికారులు చెబుతున్నారు. అక్రమ నివాసాల్లో ఉన్నవారికి నీరు, విద్యుత్ సరఫరా వెంటనే నిలిపివేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అరకొర వసతులు
క్వార్టర్స్‌లోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు సౌకర్యాలు నగరపాలక సంస్థ పర్యవేక్షిస్తుంది. ఆశాఖ పట్టించు కోక పోవడంతో ఏళ్ల తరబడి అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో కొద్దిపాటి వర్షం వస్తే వర్షపు నీరు మురుగు నీరు కాంపౌండ్‌లో నిలిచిపోతుంది. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితంగా క్వార్టర్స్‌లో ఉన్నవారు తరచూ రోగాలబారిన పడుతున్నారు. దీనికి తోడు పిచ్చిమొక్కలు పెరగడం విషపురుగులు చేరుతున్నాయి. 1953లో మద్రాస్ టెర్రస్ రూఫ్‌తో నిర్మించబడ్డ క్వార్టర్లు వర్షం వస్తే కారుతున్నాయి. కింది ఫ్లోరింగ్ కూడా దెబ్బతిన్నాయి. సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని నివాసాల్లో ఉంటున్న కొం దరు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
సహకరించండి
అక్రమంగా నివాసం ఉంటున్న వారు సహకరించాలి. సెప్టెంబర్ 7వ తేదీ లోపు ప్రభుత్వ క్వార్టర్స్ ఖాళీ చేయాలి. 8వ తేదీ మూడు బృం దాలుగా ఏర్పడి అధికారులు, ఉద్యోగులు నివాసాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తాం. ఆలోపే అక్రమ నివాసాల్లో ఉన్నవారు సహకరించాలి. ప్రభుత్వ లక్ష్యం మేరకు వాటిని ఉపయోగించేందుకు కలెక్టర్ ఆదేశిం చారు. అక్రమంగా నివాసాలు ఉంటున్న వారిని ఖాళీచేయిస్తాం.
పి. మహేశ్వరరెడ్డి, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ