మినుము రైతు కుదేలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:18 AM
అధిక వర్షాలతో మినుము పంట దెబ్బతిని రైతులు కుదేలయ్యారు.
చాగలమర్రి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): అధిక వర్షాలతో మినుము పంట దెబ్బతిని రైతులు కుదేలయ్యారు. మండలంలోని మద్దూరు గ్రామంలో నాగేశ్వరరావు అనే రైతు సాగు చేసిన నాలుగు ఎకరాల మినుము పంట దెబ్బతింది. ప్రత్యామ్నాయ పంట సాగు చేసుకునేందుకు గురువారం ట్రాక్టర్‌తో పంటను దున్నే శారు. మూడు నెలల పాటు పంటను కాపా డుకుంటూ వచ్చామని, పంట దిగుబడి సమయంలో అధిక వర్షాలు కురవడంతో పంట దెబ్బ తిని భారీగా నష్టపోయామన్నారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదు కోవాలని రైతు కోరారు.