Share News

పదవి మహిళలది.. పెత్తనం భర్తలది

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:47 PM

మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు ప్రభుత్వం రిజర్వేషన్‌ కల్పించినా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు.

 పదవి మహిళలది.. పెత్తనం భర్తలది
సమావేశానికి వచ్చిన మహిళా ప్రజాప్రతినిధుల భర్తలు

హొళగుంద, జూలై 19 (ఆంధ్రజ్యోతి): మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు ప్రభుత్వం రిజర్వేషన్‌ కల్పించినా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. పేరుకు మాత్రమే మహిళలు ఉండగా సమావేశాలకు మాత్రం వారి భర్తలే వస్తున్నారు. మండలంలో మహిళా ఎంపీటీసీలు 10 మంది ఉండగా శనివారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ నూర్జహాన్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ బుజ్జమ్మ, నేరణికి ఎంపీటీసీ సంధ్యబాయి మాత్రమే హాజరయ్యారు. మిగతా 7 మంది మహిళల స్థానంలో వారి భర్తలు కనిపించారు. అలాగే 12 మంది మహిళా సర్పంచులు ఉండగా, ఏ ఒక్కరు హాజరుకాలేదు. ఎంపీడీవో విజయలలిత మాట్లాడుతూ పలుమార్లు హెచ్చరించామని, మరోసారి ఇతరులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

ఎంపీపీ నూర్జహాన్‌ అధ్యక్షతన మండల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఎంపీడీవో విజయలలిత మాట్లాడుతూ మసమావేశం ఆలస్యంగా ప్రారంభంకావడంపై చింతిస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్‌ నిజాముద్దీన్‌ సమావేశానికి హాజరు కాకపోవడంపై మండిపడ్డారు.

Updated Date - Jul 19 , 2025 | 11:47 PM