డిమాండ్లు నెరవేర్చకపోతే నిరాహార దీక్షలే
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:07 PM
తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే భార్యాపిల్లలతో సహా ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంటామని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ రాష్ట్ర కోశాధికారి సమీర్‌బాషా స్పష్టం చేశారు.
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ రాష్ట్ర కోశాధికారి సమీర్‌బాషా
ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం
కర్నూలు న్యూసిటీ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే భార్యాపిల్లలతో సహా ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంటామని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ రాష్ట్ర కోశాధికారి సమీర్‌బాషా స్పష్టం చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపుదల సమ్మె మంగళవారం 49వ రోజుకు చేరు కుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయమన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులని ఆన్‌లైన్‌లో చూపిస్తూ ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు తల్లుల ఖాతాల్లో పడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈమేరకు తల్లికి వందనం పడని పిల్లలు, తల్లిదండ్రుల సహా మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు వెళ్లి అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి సమర్పించారు. ఈ ర్యాలీలో నగర పాలక పంప్ హౌస్‌లో, వీధిదీపాల, పార్కులు, డివైడర్లలో పనిచేసే కార్మి కులు, వారి పిల్లలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.