రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:42 PM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం శ్రీమఠం చరిత్రలో రికార్డు స్థాయిలో మొదటిసారిగా అధిక మొత్తంలో రూ.5,41,47,228 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేశ్ జోషి, సురేష్ కోణాపూర్, శ్రీపతి ఆచార్ తెలిపారు.
శ్రీమఠానికి 34 రోజుల్లో రూ.5.41 కోట్లు కానుకలు సమర్పించిన భక్తులు
మంత్రాలయం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం శ్రీమఠం చరిత్రలో రికార్డు స్థాయిలో మొదటిసారిగా అధిక మొత్తంలో రూ.5,41,47,228 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేశ్ జోషి, సురేష్ కోణాపూర్, శ్రీపతి ఆచార్ తెలిపారు. అక్టోబరు, నవంబరు నెలల్లో 34 రోజుల్లో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని మఠం గురురాజాంగణ భవనంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భధ్రత, సీసీ కెమరాల నిఘా మధ్య మంగళవారం లెక్కించారు. రూ.5,41,47,228 నగదుతో పాటు 1610 గ్రాముల వెండి, 80 గ్రాములు బంగారు, విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు చెప్పారు. వచ్చిన నగదును శ్రీమఠం బ్యాంకు ఖాతాకు జమ చేసినట్లు తెలిపారు. అయితే విదేశీ కరెన్నీ నోట్లను ఇంకా లెక్కించలేదని చెప్పారు. పెద్దమొత్తంలో హుండీ ఆదాయం చేకూరడంతో శ్రీమఠం అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో భక్తులకు సమష్టిగా సేవలు అందించడంతో సాధ్యమైందని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు సిబ్బందిని అభినందించారు. ఈ హుండీ లెక్కింపులో అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, అనంత పురాణిక్, జేపీస్వామి, కృష్ణమూర్తి, దేశాయ్ నరసింహమూర్తి, గిరిధర్, సుజ్ఞానేంద్ర, శ్రీపాదాచార్‌పాల్గొన్నారు.