ఓపిక పోతోంది!
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:14 AM
సీజనల్ వ్యాధులతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కిటకిటలాడుతోంది. జ్వరాలు, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో ఆసుపత్రికి రోగులు బారులుదీరుతు న్నారు.
విజృంభిస్తున్న జ్వరాలు
సర్వజన ఆసుప్రతిలో కిక్కిరిసిన రోగులు
ఒక్క రోజులోనే 3,291 మందికి ఓపీ
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సీజనల్ వ్యాధులతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కిటకిటలాడుతోంది. జ్వరాలు, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో ఆసుపత్రికి రోగులు బారులుదీరుతు న్నారు. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో వైరల్ జ్వరంతో ప్రజలు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో కర్నూలు జీజీహెచ్ రోగులతో కిక్కిరిసింది. సోమవారం ఓపీకి రికార్డు స్థాయిలో 3,291 మంది (రాత్రి 9 గంటలకు) రాగా, ఇందులో 412 మంది మెడికల్ ఓపీకి, చిన్నపిల్లల ఓపీకి 310 వచ్చారు. ఇందులో మెడికల్ విభాగంలో 56 మంది అడ్మిషన్ పొందగా.. పీడీయాట్రిక్‌లో 60 మంది చిన్న పిల్లలు అడ్మిషన్ పొందారు.
ఉదయం ఓపీ కోసం రోగులు ఆగచాట్లు పడ్డారు. ఓపీ టికెట్ ఇస్తే చాలు వైద్యం అందినట్లేనని కొందరు రోగులు చెప్పడం విశేషం. మేల్ ఓపీ రోగలుకు ఓపీ సులభంగా లభించినప్పటికీ మహిళా రోగులు మాత్రం ఉదయం 11 గంటలైనా ఓపీ చీటీలు దొరకని పరిస్థితి నెలకొంది. వైద్యాధిధికారుల నిర్లక్ష్యంతో ఓపీ వద్ద మహిళా రోగులు, వృద్దులు ఇబ్బందులు పడ్డారు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆసుపత్రికి రోగులు వస్తున్నారు.