Share News

తెలంగాణ వారు ఎలా కొనసాగుతారు?

ABN , Publish Date - Aug 17 , 2025 | 01:14 AM

శ్రీశైలం దేవస్థానంలో నిత్యాన్నదానం చేస్తున్న వడ్డెర సత్రం చైర్మనగా తెలంగాణకు చెందిన వ్యక్తి ఎలా కొనసాగుతారని వడ్డెర కార్పొరేషన మాజీ ఛైర్మన దేవళ్ల మురళి ప్రశ్నించారు.

 తెలంగాణ వారు ఎలా కొనసాగుతారు?
మాట్లాడుతున్న వడ్డెర కార్పొరేషన మాజీ చైర్మన దేవళ్ల మురళి

నందికొట్కూరు, ఆగ స్టు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం దేవస్థానంలో నిత్యాన్నదానం చేస్తున్న వడ్డెర సత్రం చైర్మనగా తెలంగాణకు చెందిన వ్యక్తి ఎలా కొనసాగుతారని వడ్డెర కార్పొరేషన మాజీ ఛైర్మన దేవళ్ల మురళి ప్రశ్నించారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ రాషా్ట్రలుగా విడిపోయాక శ్రీశైలం దేవస్థానంలో ఉన్న వడ్డెర కులస్తులంతా కలిసి ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన సత్రానికి చైర్మనగా జరుపటి రాముడు అక్రమంగా కొనసాగుతున్నారన్నారు. రాముడు స్వచ్ఛందంగా చైర్మన పదవి నుంచి తొలగిపోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు చక్రధర్‌, టీడీపీ వడ్డెర సాధికర సమితి ప్రధాన కార్యదర్శి సంపంగి రవి, వడ్డెర సంఘం నాయకులు నందికొట్కూరు తాలుకా అధ్యక్షులు శివమణి, శ్రీరాములు, వెంకటేశ్వర్లు, మధు, రాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 01:14 AM