Share News

ఇంకెన్నాళ్లో..!

ABN , Publish Date - Oct 23 , 2025 | 10:42 PM

నగరంలోని ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్‌లోని ఆక్రమణదారుల పాగా కొనసాగుతోంది. క్వార్టర్స్‌ ఖాళీ అవుతాయో.. లేదోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

ఇంకెన్నాళ్లో..!

ప్రభుత్వ క్వార్టర్స్‌ ఖాళీ అయ్యేనా..?

ముగిసిన గడువు

కలెక్టర్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారో?

ఎదురుచూస్తున్న ఉద్యోగులు

కర్నూలు అర్బన్‌ , అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్‌లోని ఆక్రమణదారుల పాగా కొనసాగుతోంది. క్వార్టర్స్‌ ఖాళీ అవుతాయో.. లేదోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. అక్రమార్కులు ఖాళీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఇచ్చిన గడువు గురువారంతో ముగిసింది. గత కలెక్టర్‌ ఆదేశాలు అమలవుతాయా.. లేక కొత్త కలెక్టర్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. దాదాపు 90ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఉన్న 965 ప్రభుత్వోద్యోగుల కోసం నిర్మించిన నివాసాలు కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. మరి కొన్నింట్లో ఆక్రమణదారులు పాగా వేశారు. ఈ విషయంపై కొందరు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ప్రభుత్వం కూడా నగరంలోని ప్రధాన కాలనీగా కోట్ల విలువ చేసే స్థలాలు కబ్జాకు గురికాకుండా చర్యలు చేపట్టినట్లు ఆదేశించినట్లు సమాచారం. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యాక ఉద్యోగులు, ఆక్రమణదారుల మధ్య వాగ్వాదం చేసుకున్న విషయం తెలి సిందే. ఆందోళనల నేపథ్యంలో ఆర్‌డీవో అక్టోబరు 23 వరకు స్వచ్చందంగా ఖాళీ చేయాలని అక్రమణ దారులకు మరో సారి గడువు ఇచ్చారు. ఈ క్రమంలో అప్పటి కలెక్టర్‌ బదీలీ కావడం, జిల్లా ప్రధాని పర్యటన నేపథ్యంలో విష యం అటకెక్కింది. జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్‌ ఏచర్య తీసుకుంటారోననే ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇదే విష యం ఆర్‌అండ్‌ బీ ఈఈ సునీల్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా ఖాళీ అయిన క్వార్టర్స్‌లో కొత్తగా ఉద్యోగులకు అలాట్‌ చేస్తున్నామని, తదుపరి చర్యలు కలెక్టర్‌ నుంచి వచ్చే ఆదేశాలపై ఆధారపడి ఉంటుందన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 10:42 PM