అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి
ABN , Publish Date - Aug 05 , 2025 | 01:09 AM
కర్నూలు నియోజకవ ర్గంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకోవా లని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత రెవన్యూ అధికారులకు ఆదేశించారు.
రెవెన్యూ అధికారులను ఆదేశించిన మంత్రి టీజీ భరత
కర్నూలు అర్బన, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): కర్నూలు నియోజకవ ర్గంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకోవా లని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత రెవన్యూ అధికారులకు ఆదేశించారు. సోమవారం సాయంత్రం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అమీర్ హైదర్‌ఖాన నగర్, కారల్ మార్క్స్,నగర్, బుధవా రపేట, జగన్నాథగట్టుపై టిడ్కో ఇళ్లతో పాటు నగరంలోని వివిధ ప్రాం తాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఇళ్ల పట్టాలు లేనిచో వారికి పట్టాలు ఇచ్చే విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిం చారు. నగరంలోని ప్రభుత్వ క్వార్టర్స్‌పై ఆరాతీశారు. ఖాళీగా ఉన్న వాటిని ఇతరులు అక్రమించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఆర్‌వో వెంకటనారాయణమ్మ, కర్నూలు రూరల్, అర్బన, కల్లూరు తహసీల్దార్లు రమేష్‌బాబు, రవికు మార్, ఆంజనేయులు పాల్గొన్నారు.