Share News

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

ABN , Publish Date - Sep 11 , 2025 | 12:29 AM

అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య తెలిపారు.

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
లేఅవుట్‌ను పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ నవ్య

బస్తిపాడులో లేఅవుట్‌ను పరిశీలించిన జేసీ నవ్య

కల్లూరు, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య తెలిపారు. కల్లూరు మండలం బస్తిపాడు గ్రామంలో బుధవారం ఆమె ఆర్డీవో సందీప్‌కుమార్‌తో కలిసి పేదలకు అనువైన స్థలాన్ని పరిశీ లించారు. జాయింట్‌ కలెక్టర్‌ నవ్య మాట్లాడుతూ బస్తిపాడులో లే అవుట్‌ త్వరితగతిన పూర్తి చేసి అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని తహసీల్దార్‌ కె.ఆంజనేయులును ఆదేశిం చారు. ఇళ్లు లేని పేదలకు జీవో నంబర్‌ 23 ప్రకారం అర్బన్‌లో 2 సెంట్లు, రూరల్‌లో 3 సెంట్ల స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉలిందకొండ సింగిల్‌విండో డైరెక్టర్‌ నాగరాజు, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, ఆర్‌ఐ రంగస్వామి, సర్వేయర్‌ సుధా కర్‌, వీఆర్వో రామకృష్ణ, విలేజ్‌ సర్వేయర్‌ శబరి పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 12:29 AM