Share News

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:47 AM

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు.

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, జూలై 12(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు. శనివారం మాధవీ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో ఎ.గోకులపాడు గ్రామంలో అర్హులైన 30 మందికి ఆమె ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గౌరు చరిత మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పట్టణ, గ్రామ ప్రజలకు ఇళ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారని, ఎ.గోకులపాడులో 30 మంది ఎస్సీలకు ఒక్కోక్కరికీ 1.5 సెంట్ల చెప్పున పట్టాలు అందించామన్నారు. మాజీ సర్పంచు లక్ష్మీవరదారెడ్డి, గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నాగరాజు, రమణారెడ్డి, బీజేపీ నాయకుడు సింగం సోమశేఖర్‌రెడ్డి, సుంకన్న, టి.రాజు, రామాంజనేయులు నెరవాడ జాఫర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 12:47 AM