ఇంటి పట్టాలు ఇవ్వాలి: సీపీఎం
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:23 AM
నగరంలోని బాలగంగాధర్ తిలక్ నగర్ ప్రజలకు ఇంటి పట్టాలని ఇవ్వాలని కోరుతూ కొత్తబస్టాండు ఎదురుగా రాస్తారోకో చేపట్టారు.
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): నగరంలోని బాలగంగాధర్ తిలక్ నగర్ ప్రజలకు ఇంటి పట్టాలని ఇవ్వాలని కోరుతూ కొత్తబస్టాండు ఎదురుగా రాస్తారోకో చేపట్టారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకోలో న్యూసిటీ కార్యదర్శి టి.రాముడు మాట్లాడుతూ 42వ వార్డు తిలక్ నగర్‌లో ప్రజలు గత 50 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నా రన్నారు. వారికి జీవో నెంబరు 30 ప్రకారం రెగ్యులరైజ్ చేస్తూ ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సి.గురు శేఖర్, వై.నగేష్, నగర కార్యదర్శివర్గసభ్యులు సీహెచ. సాయిబాబా, కే.సుధాకరప్ప, కిరణ్మయి పాల్గొన్నారు.