అలా వదిలేశారు!
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:07 AM
మండల కేంద్రంలోని రాజానగర్ కాలనీలో సమీపంలో 2016లో ఎస్సీ బాలుర హాస్టల్ భవనం నిర్మించారు. అయితే రెండేళ్లకే విద్యార్థులు లేరన్న సాకుతో ఎస్సీ బాలుర హాస్టల్‌ను 2018లో ఎత్తివేశారు.
హొళగుందలో నిరుపయోగంగా హాస్టల్ భవనం, మందుబాబుల అడ్డా
హొళగుంద, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని రాజానగర్ కాలనీలో సమీపంలో 2016లో ఎస్సీ బాలుర హాస్టల్ భవనం నిర్మించారు. అయితే రెండేళ్లకే విద్యార్థులు లేరన్న సాకుతో ఎస్సీ బాలుర హాస్టల్‌ను 2018లో ఎత్తివేశారు. అనంతరం దీన్ని మరో కార్యాలయానికి, పాఠశాలకు ఉపయోగించకుండా వదిలేశారు. దీంతో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనం కాస్తా శిథిలావస్థకు చేరుతోంది. రాత్రిళ్లు మందుబాబులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. విలువైన భవనాన్ని ఇలా నిరుపయోగంగా వదిలేయడం పట్ల విద్యావేత్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి హాస్టళ్ల భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.